EastGodavari

News July 2, 2024

డీజీపీని కలిసిన మాజీ ఎంపీ మార్గాని భరత్

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులు పెరిగాయని, వాటిని అరికట్టి‌ దోషులను శిక్షించి శాంతిభద్రతలను కాపాడాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర డీజీపీని కోరారు. రాజమండ్రిలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని టీడీపీ ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఆయననను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలపై విచారణ జరిపించాలన్నారు.

News July 2, 2024

తూ.గో: ఈ నెల 4న లాటరీ ద్వారా సీట్ల భర్తీ

image

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్లను ఈ నెల 4న భర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త వెంకట్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ లాటరీ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తారని, ఆసక్తి కలిగిన విద్యార్థులు వారికి అనువుగా ఉండే పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేయాలన్నారు. ➠ SHARE IT..

News July 1, 2024

ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు ఇవ్వాలని డిమాండ్

image

పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్తిబాబు, సెక్రటరీ సుధీర్ బాబు, ట్రెజరీ దేవి డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

News July 1, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి వాసంశెట్టి సుభాశ్

image

మంత్రి వాసంశెట్టి సుభాశ్ మానవత్వం చాటుకున్నారు. రామచంద్రపురంలోని సూర్యనగర్‌లో ఉంటున్న సుహాస్ అనే బాలుడు బ్రెయిన్ ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకొని బాలుడి తండ్రి శివ (ఆర్టీసీ కండక్టర్), తల్లి ఉమాదేవితో మాట్లాడారు. తక్షణ సాయం కింద తన క్యాంపు కార్యాలయంలోనే రూ.10 వేలు అందజేశారు. ప్రతి నెలా తనవంతు సాయంగా రూ.6 వేలు ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆ దంపతులు వాసంశెట్టికి కృతజ్ఞతలు తెలిపారు.

News July 1, 2024

పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తా: పవన్

image

పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని స్థానిక MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం అభివృద్ధి కోసం ఏం చేయగలనా..? అంటూ నిత్యం ఆలోచిస్తానని, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే తనను ఊరేగించండని అక్కడి ప్రజలతో అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తానన్నారు. డొక్కా సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 1, 2024

2 వారాలకోసారి పిఠాపురంలోనే కలెక్టర్: పవన్ కళ్యాణ్

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. చేబ్రోలులో పింఛన్లు పంపిణీ చేసిన పవన్ మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 2 వారాలకొకసారి కలెక్టర్ షన్మోహన్ స్వయంగా పిఠాపురం వస్తానని తనతో చెప్పారన్నారు. సమస్యలను ఫిర్యాదుల రూపంలో తేలియజేస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ అభినందించారు.

News July 1, 2024

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు మాతృవియోగం

image

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాతృమూర్తి చెల్లుబోయిన శుభద్రమ్మ సోమవారం మృతిచెందారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి నగరంలోని కోటిలింగాల ఘాట్ నందు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్

image

కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు హైవే పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు కలెక్టర్ శన్మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

News July 1, 2024

తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News July 1, 2024

తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్

image

తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.