India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
గుంటూరు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, సోషల్ వర్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఎంపికైన వారికి ఇప్పటికే నియామకాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండో విడత ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా వెబ్సైట్లో ఉంచారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు డీఎంహెచ్ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరావాలన్నారు.
గుంటూరు జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్దేశించిన 11,049 ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా ఒకే రోజు 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారని, దీనిలో జిల్లాకు 11,049 ఇళ్లు లక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు మిర్చియార్డులో విషాదం చోటుచేసుకుంది. యార్డులోకి వెళ్తున్న లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్లోడ్ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. ఈ లడ్డూ రూ. 5,01,000లకు అమ్ముడై గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. ప్రతి సంవత్సరం జరిగే వినాయక మహోత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సిరిపురం గ్రామానికి చెందిన కడియాల పరమేశ్వరరావు (అశోక్) భక్తిశ్రద్ధలతో లడ్డూను దక్కించుకున్నారు.
గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికల కోసం ఇంటర్వ్యూ జరగనుంది. హోమ్ సైన్సెస్‌లో 50% మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం కలిగిన వారు ఇంటర్వూలకు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.ఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గుంటూరులో ఆదివారం నాటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.200, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.180గా విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో రూ. 20 నుంచి రూ.30 వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బార్లకు వేలంపాట నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 బార్లకు దరఖాస్తులు అందాయని, 10 కల్లుగీత కార్మికులకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. వేలంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.
ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ తప్పనిసరి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, బ్యాంకింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, బిజినెస్ ఎనాలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి 8 స్పెషలైజేషన్లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.
Sorry, no posts matched your criteria.