Guntur

News May 9, 2024

కొల్లూరు: కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని తిప్పలకట్ట దగ్గర కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దొరికినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కృష్ణానదిలో సుమారు 70ఏళ్ల వయస్సు ఉన్న మగ శవం వుండటంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు దేహాన్ని పోలీస్ స్టేషన్‌లో తెలపాలని ఎస్సై వెల్లడించారు.

News May 9, 2024

పత్రికలలో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల సందర్భంగాఈ నెల 12 ,13 రెండు రోజులు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీ చేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధృువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.

News May 9, 2024

ప్రజాగళం సభను జయప్రదం చేయండి : వీరాస్వామి

image

టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల పట్టణంలో రేపు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు. గురువారం మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

News May 9, 2024

గుంటూరు: పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్

image

పల్లెవెలుగు బస్సులో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులుకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు , ఇతర సిబ్బందిలో స్వీప్ యాక్టివిటీ, ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి సంతోషం వ్యక్తపరిచారు. ప్లకార్డులతో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

News May 9, 2024

టీడీపీకి మద్దతు తెలిపిన జమాత్ ఉలమ ఏ హింద్

image

టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖాసిమి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలమ ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామని చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు.

News May 9, 2024

గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతాం: కిలారి రోశయ్య

image

గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీతో కలిసి గురువారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. జగన్ పాలనకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపాలని సూచించారు.

News May 9, 2024

గుంటూరు: ‘జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి’

image

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 9 నుంచి జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త, తెనాలి ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాలకు జిల్లాలోని ఐటీఐల్లో సంప్రదించాలని సూచించారు.

News May 9, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రదేశాలలో 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మే 13న జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగనుందని అన్నారు. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు.

News May 9, 2024

బాపట్ల: 11వ తేదీ రాత్రి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి అరుణకుమారి తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా సీజ్ చేస్తామన్నారు. వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News May 9, 2024

గుంటూరు జిల్లాకు 9 మంది ట్రైనీ IPSలు

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గుంటూరు జిల్లాకు ఎలక్షన్ కమిషన్ 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. వారితో జిల్లా ఎస్పీ తుషార్ బుధవారం పోలీస్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఏఎస్పి షెల్ కె, మనోజ్ హెగ్డే పాల్గొన్నారు.