Guntur

News February 1, 2025

రోడ్డు ప్రమాదంలో వట్టిచేరుకూరు మండల వాసులు మృతి

image

గుంటూరు నగర శివారు ఏటుకూరు-ప్రత్తిపాడు రోడ్డు నల్లపాడు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు వట్టిచేరుకూరు మండలం కుర్నూతల, బయ్యారం గ్రామస్థులుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 1, 2025

‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో

image

జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.

News February 1, 2025

గుంటూరు: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ, 3వ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది. 

News January 31, 2025

ఏటుకూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం!

image

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతిచెందిన యువకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 31, 2025

మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మంగళగిరి పరిధి ఎన్నారై వై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వై జంక్షన్ వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

News January 31, 2025

గుంటూరు: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ, 3వ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది. 

News January 31, 2025

గుంటూరు: డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన యువకుడు

image

గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి ఓబుల నాయుడుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ఇరువురు యువకులు డివైడర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఓ యువకుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి సర్వీస్ రోడ్డు కిందకు పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో యువకుడికి చేతికి గాయం అయ్యింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News January 31, 2025

టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: లోకేశ్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో గురువారం సమావేశం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేశ్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు.

News January 30, 2025

ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకారం అందించాలన్నారు. కలక్టరేట్‌లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణ, 27న ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.

News January 30, 2025

ANU: డిగ్రీ మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వీసి కే.గంగాధరరావు విడుదల చేశారు. పరీక్షలకు 9329 మంది హాజరవగా 5198 మంది ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సందేహాలు ఉంటే రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.