India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతిచెందిన యువకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంగళగిరి పరిధి ఎన్నారై వై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వై జంక్షన్ వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ, 3వ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి ఓబుల నాయుడుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వస్తున్న ఇరువురు యువకులు డివైడర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఓ యువకుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి సర్వీస్ రోడ్డు కిందకు పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో యువకుడికి చేతికి గాయం అయ్యింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో గురువారం సమావేశం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేశ్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు.

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకారం అందించాలన్నారు. కలక్టరేట్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణ, 27న ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గత ఏడాది నవంబర్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వీసి కే.గంగాధరరావు విడుదల చేశారు. పరీక్షలకు 9329 మంది హాజరవగా 5198 మంది ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సందేహాలు ఉంటే రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీమంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.

చిలకలూరిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గోవింద్ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. తోటి పిల్లలు అది గమనించి చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుగ్గిరాల, చిలువూరు స్టేషన్ల మధ్య మంచికలపూడి రైల్వే గేటు సమీపంలో సుమారు 30 – 35 ఏళ్ల వయసున్న వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు.
Sorry, no posts matched your criteria.