India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పల్నాడు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర నేటి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం నుంచి ప్రారంభమవుతుంది. రొంపిచర్ల, విప్పర్ల, నకరికల్లు, దేవరంపాడు క్రాస్ రోడ్డు కొండమోడు మీదగా పిడుగురాళ్లకు చేరుకుంటుంది. పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ వద్ద సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కొండమోడు జంక్షన్ మీదుగా రాజుపాలెం, అనుపాలెం, రెడ్డిగూడెం మీదగా దూళిపాళ్ళ చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు.
కాకుమాను గ్రామ సచివాలయం-2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వాంగ రత్న కిషోర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, వైసీపీ సంబంధించిన ర్యాలీలో మంగళవారం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ను తొలగించామని కాకుమాను పంచాయతీ కార్యదర్శి నివేదిక సమర్పించారు. వాలంటీర్‌ను విధుల నుంచి ఎంపీడీఓ తొలగించారు.
పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్రకు మంచి రికార్డ్ ఉంది. ఆయన వరుసగా 1994, 99, 2004, 2009, 2014లో TDP ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. కేవలం 1112 ఓట్లతో డబుల్ హ్యాట్రిక్ విజయం ముంగిట బోల్తా కొట్టారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీతో ధూళిపాళ్ల తలపడనున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి మీ కామెంట్.
ప్రత్తిపాడు నుంచి మాకినేని పెదరత్తయ్య వరుసగా 5సార్లు MLA అయ్యారు. 1983, 85, 89, 1994, 1999లో ఆయన TDP నుంచి విజయం సాధించారు. ఈయన మొత్తం 6సార్లు పోటీ చేయగా, 2004లో రావి వెంకటరమణ చేతిలోనే ఓడిపోయారు. ఈయన బరిలో నిలిచిన అన్నిసార్లు కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను బరిలో దించింది. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి బలసాని కిరణ్ కుమార్, కూటమి నుంచి బి.రామాంజనేయులు బరిలో ఉన్నారు.
సీఎం జగన్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నారు. నేడు శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో వేడుకల్లో పాల్గొననున్న ఆయన, మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉగాది రోజు మేనిఫెస్టో ప్రకటన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ మంగళవారం ప్రజల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో జగన్ సతీసమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది పంచాంగ శ్రవణం వింటారు. నిన్న జగన్ యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, మంగళగిరి నుంచి వైసీపీ బరిలో మురుగుడు లావణ్య, కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
మండలంలోని ముట్లూరు గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముట్లూరుకు చెందిన అలెక్స్ (24) తన నివాసంలో మంచినీటి మోటారు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అలెక్స్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ముట్లూరు వచ్చాడు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వెయ్యాలని అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి పార్టీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని కోరారు.
Sorry, no posts matched your criteria.