India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్న 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళతారు. అనంతరం అక్కడ జీఎస్‌డీపీ వృద్ధిపై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఐ అండ్ పీఆర్ శాఖపై, ఆ తర్వాత నెలవారీ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై రివ్యూ చేస్తారని చెప్పారు.

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.

చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాణ్యమైన వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది సెప్టెంబర్ 28న పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్‌గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.
Sorry, no posts matched your criteria.