India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు నగర శివారు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో గుంటూరు నల్లపాడు గ్రామానికి చెందిన కరణం శేషా సాయి (28) మృతి చెందాడు. మరొక ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి వంకాయలపాడు స్పైసెస్ పార్కుకు మినీ ట్రావెల్ బస్సులో సిబ్బంది వెళ్తుండగా.. బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డట్టు సమాచారం .పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గుంటూరు అమ్మాయికి బెల్జియం అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరు శివారు లాల్ పురానికి చెందిన పుష్పలత హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ. ప్రాజెక్ట్ పనిపై బెల్జియం వెళ్లారు. అక్కడ ప్రాజెక్టులో పని చేస్తున్న బెల్జియంకు చెందిన క్రిష్ పోలేంటితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గుంటూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.
గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు వచ్చాయి. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారు. శని, ఆది వారాలు వారాంతపు సెలవులు కావడంతో క్రయవిక్రయాలు జరగవు.వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజుల పాటు క్రయవి క్రయాలు జరగవని, సోమవారం యథావిధిగా విక్రయాలు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వ శ్రేష్ట త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఐజీగా పనిచేసిన పాలరాజుని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయగా ఆయన స్థానంలో త్రిపాఠిని నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని గుంటూరు ఎస్పీ తుషార్ దూడి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. గుంటూరు రేంజ్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఐజీ తెలిపారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ నియమితులయ్యారు. కాగా ఈయన గతంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన బిందుమాధవ్ పశ్చిమగోదావరి జిల్లా గ్రేహౌండ్స్, రంపచోడవరంలో అసిస్టెంట్ ఎస్పీగా, ఎస్‌ఈబీ గుంటూరు రూరల్ జిల్లా జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు.
కారంపూడి మండలంలోని కారంపూడి పట్టణానికి చెందిన 50 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఎంపీడీఓ గంట శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అలాగే వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంపిణీ చేయొద్దంటూ ఆంక్షలు విధించింది. దీంతో వారు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హౌరా-యశ్వంతపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారి బుధవారం తెలిపారు. ఈనెల 4, 11 తేదీల్లో ఈ రైలు (02863) హౌరాలో 12.40 గంటలకు బయలుదేరి విజయవాడ మరుసటి రోజు 07.25, గుంటూరు 08.20, యశ్వంతపూర్ శనివారం 00.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02864) ఈనెల 6, 13 తేదీల్లో యశ్వంతపూర్‌లో 5 గంటలకు ప్రారంభమై గుంటూరు 17.25 వస్తుంది.
నీటి తొట్టెలో పడి మూడేళ్ల పాప మృతి చెందిన ఘటన తెనాలి యడ్లలింగయ్య కాలనీ శివారు పొలాల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి తొట్టెలో పడిందని, ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటిస్తూ.. తమ ప్రచారాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. పార్టీ కండువాలతో వెళ్లొద్దని సూచించారు.
జిల్లాలోని 13000 ఎన్నికల సిబ్బంది ఎన్నికల రోజూ బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే జీరో రీ పోల్ సాధ్యమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలను రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.