India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కర్లపూడి గ్రామానికి చెందిన అభిషేక్ (17) పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్నానానికి వైకుంఠపురం పుష్కరఘాట్‌కు వచ్చి నీట మునిగి చనిపోయాడు.
వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.
సుప్రీమ్ కోర్ట్ 2006లో ప్రకాష్ సింగ్ కేసు తీర్పులో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలననుసరించి, పోలీస్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించడానికి “పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థలను” రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేసినట్లు మంగళవారం అధికారి తెలిపారు.
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్‌లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్‌ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.
వినుకొండ మండలం పెద్ద కంచర్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పర్యటించారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి వచ్చిన వారిని వినుకొండ ప్రాంతం ఆదరించిందని అన్నారు. తనను ఎంపీగా గెలిపించి, ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపిస్తే నియోజకవర్గాన్ని, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసాని ఇచ్చారు.
గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు.
పెదకూరపాడు గ్రామ 3వ సచివాలయం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏటుకూరి గోపిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో జరిగిన TDP విస్తృతస్థాయి సమావేశంలో ఇతను భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారి కందుల శ్రీరాములు వాలంటీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో మల్లేశ్వరికి ఉత్తర్వులు జారీ చేశారు.
పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్‌లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.