Guntur

News March 18, 2024

బాపట్ల: పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బందోబస్తు నిర్వహణకు 216 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థులు కేంద్రాలకు వచ్చి వెళ్లటానికి ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. 216 మంది ఏఎన్ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 18, 2024

పల్నాడు: 2 బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్‌ పై ఉన్న మమత, గుణశేఖర్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.

News March 18, 2024

నేటి స్పందన కార్యక్రమం రద్దు: బాపట్ల ఎస్పీ

image

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్‌ను నేడు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీస్ కార్యాలయానికి ప్రజలు రావద్దని కోరారు.

News March 18, 2024

గుంటూరు: విద్యార్థులకు RTCలో ఉచిత ప్రయాణం

image

నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.

News March 18, 2024

పోలీస్ కార్యాలయంలో స్పందన రద్దు: ఎస్పీ తుషార్

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. 

News March 17, 2024

పోలీస్ కార్యాలయంలో స్పందన రద్దు: ఎస్పీ తుషార్

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏదైనా సమస్యలు వుంటే పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8688831568 ఫోన్లో, వాట్స్అప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. 

News March 17, 2024

గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు

image

గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారు. 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరయ్యారు. 6,325 మంది గైర్హజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పరిశీలించారు. 

News March 17, 2024

గుంటూరులో కలెక్టర్ స్పందన కార్యక్రమం రద్దు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎలక్షన్ కోడ్ ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో ఫిర్యాదులు అందించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

News March 17, 2024

500 కుటుంబాల అభివృద్ధికి రూ.3కోట్లు: ఎంపీ బాలశౌరి

image

ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ కింద నాగాయలంక, కోడూరు మండలాల్లోని 500 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నాబార్డ్ ఛైర్మన్‌తో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయించినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులోని కార్యాలయం నుంచి ప్రకటనలో పేర్కొన్నారు. ఆ నిధులతో ఆ కుటుంబాలకు బోట్లు, చేపలు పట్టే వలలు, మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా చేపల ఫీడ్ తయారు చేసే మిషన్లు ఇతర పరికరాలు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు.

News March 17, 2024

పల్నాడు: ఎన్నికల కోడ్ అమలుపై ఆదేశాలు 

image

ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై అందరు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.