India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రూ.38కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు రూ.281.38కోట్లను ప్రభుత్వం అందించింది.
సీఎం చంద్రబాబు కూడా ఘిబ్లి ట్రెండ్‌లో చేరారు. ఈ మేరకు ‘X’లో ఆయన పలు చిత్రాలను పోస్ట్ చేశారు. సీఎం పెట్టిన చేసిన ఫొటోలలో పీఎం నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి విజయోత్సవ సమావేశంలో తీసిన ఫొటో ఉంది. అలాగే నారా లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌తో కలిసి ఉన్న ఫొటో, విజయవాడలో వరద బాధితులను ఓదార్చుతున్న ఫొటోలను సీఎం పోస్ట్ చేశారు.
గుంటూరు జిల్లాలో 2025లో ఇప్పటివరకు 162 మంది వరకు సూసైడ్ చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఈనెలలో ఇప్పటికే 49 మంది సూసైడ్ చేసుకున్నారన్నారు. 2023లో 883మంది, 2024లో 806 మంది సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సూసైడ్‌లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. క్షణికావేశంలో సూసైడ్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులు కోరుతున్నారు.
గుంటూరులో చికెన్ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఇటీవల కొంతమేర ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత ఆదివారం రూ.180 ఉన్న స్కిన్ లెస్ చికెన్ ధర నేడు రూ.230కి చేరింది. దీంతో గత వారంతో పోల్చుకుంటే రూ.50ధర ఎక్కువైంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ.1000 విక్రయిస్తున్నారు.
తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన p- 4 సభతో పాటు ఉగాది పురస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్టు శనివారం అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు రాజకీయ ప్రముఖులు అధికారులు సభ ఏర్పాటు పర్యవేక్షించారు.
P-4 కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వెలగపూడి వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్, అడిషనల్ ఎస్పీ సుప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా CM వచ్చే రూట్లో కూడా ఏరియా డామినేషన్ పార్టీలు తిరగనున్నట్లు చెప్పారు.
తిరువూరు టీడీపీ కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొలికపూడి పై ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి వ్యవహరం తమ దృష్టికి రాలేదని తెలిపారు. అతనిపై ఎవరూ మాకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని కుటుంబంలో చిన్నచిన్న కలహాలు సహజమన్నారు. ఈ వ్యవహారానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతామన్నారు.
గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపుతుంది. 27వ తేదీన నాజ్ సెంటర్లో అనారోగ్యంతో పడిపోయి ఉండగా స్థానికులు సహాయంతో జిజిహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించారని కొత్తపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.
సీనియర్ NTRకు తెనాలితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికీ ఈ ఫొటో చూస్తే ఎన్టీఆర్ అభిమానులకు ఆయన రాజకీయ వైభవం గుర్తుకు వస్తుంది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రచారంలో భాగంగా 1982లో తెనాలి మార్కెట్‌లోని మున్సిపాలిటీ బిల్డింగ్ వద్ద ఆయన సభ నిర్వహించారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇది. ఆ సభకు తెనాలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ సభలో తన ప్రసంగంతో NTR ప్రజలను ఆకట్టుకున్నారు.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్‌ల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లైక్, షేర్ చేస్తే రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.