India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
గుంటూరు మిరప మార్కెట్‌కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.
వేసవి వచ్చిందంటే చాలు గతంలో పిల్లలంతా అమ్మమ్మల ఊళ్లకు పయనమయ్యేవారు. పొలాల్లో ఆటలు, తాతయ్యల సరదాలు.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. కానీ, నేటి తరం పిల్లలకు ఆ అనుభూతి అంతగా కలగడం లేదు. గతంలో వేసవి సెలవుల్లో బంధువుల కలయికతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగవుతోంది. తాతయ్యల ఒడిలో కథలు వినడం, అమ్మమ్మల చేతి గోరు ముద్దలు వంటివి అరుదుగా కనిపిస్తున్నాయి. మీకున్న జ్ఞాపకాలు ఎంటో COMMENT చేయండి.
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీశ్ కుమార్ నేతృత్వంలో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్, మార్కెట్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. వాహనాల రిజిస్ట్రేషన్, సరుకు వివరాలను పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
మే నెలలో జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 30లోపు చెల్లించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 3 సబ్జెక్టులకు రూ.110, అంతకు మించితే రూ.125 చెల్లించాలన్నారు. మే 1 నుంచి పరీక్ష ముందు రోజు వరకు చెల్లిస్తే అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కి రూ.1,000లు మే 1లోపు చెల్లించాలన్నారు.
గుంటూరు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పింఛన్ పంపిణీ సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పంపిణీలో కొన్ని లోపాలు తేలినట్లు పేర్కొంటూ, వృద్ధులను గౌరవంతో చూడాలని, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు ఇవ్వాలని ఆదేశించారు. అవినీతి, అమర్యాదలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.
గుంటూరు ఖ్యాతిని చాటుతూ నలుగురు చిన్నారులు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. బోరుపాలెంకు చెందిన సంవేద్ కేవలం 50 సెకన్లలో అత్యంత వేగంగా సరళి స్వరాలు ఆలపించి అబ్బురపరిచాడు. తుళ్లూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు ఆధ్య, ఆరాధ్య పియానో విన్యాసంతో మెస్మరైజ్ చేయగా, తెనాలికి చెందిన అభిషేక్ తన మ్యూజిక్ టాలెంట్‌తో గిన్నిస్ ఘనత సాధించాడు. విజయవాడలో శుక్రవారం వీరికి ఆ రికార్డుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఏఈపీఎస్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలతో నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మోసాల నుంచి రక్షణ కోసం ఎంఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసి, వెంటనే మళ్లీ లాక్ చేయాలని, ఇటీవలి కాలంలో వేలిముద్రలు వినియోగించిన చోట్ల డీలింక్ చేయాలన్నారు. మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పాత వాహనాల పరికరాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాడిన పరికరాలు వేలంలో ఉంచుతున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.