Guntur

News December 1, 2024

మోదీ, చంద్రబాబుపై అభిమానం వెయ్యి రెట్లు పెరిగింది: పెమ్మసాని

image

దేశాన్ని, రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో నడిపిస్తున్న పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుపై అభిమానం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పడానికి గర్వంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆడిటర్లు, అకౌంటెంట్లకు అభినందనలు తెలిపారు.

News November 30, 2024

GNT: ‘పవన్‌కి ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉంది’

image

బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి.. ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉందన్నారు. మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

News November 30, 2024

అది మహాభారతం అయితే.. ఇది ఆంధ్రభారతం

image

పల్నాటి యుద్ధం, ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతములో 1176-1182 మధ్యకాలంలో జరిగింది. మహాభారతానికి, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటంతో దీనిని ‘ఆంధ్ర భారతం’ అనికూడా అంటారు. పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. కాగా కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలాన్ని గుర్తించారు.

News November 30, 2024

2015లో ‘రిషితేశ్వరి’ రాసిన కన్నీటి లేఖ ఇదే.!

image

ANU విద్యార్థిని రిషితేశ్వరి చివరి క్షణాల్లో రాసిన లేఖ క్రూరమృగాలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది. కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీనియర్‌లకు ఏం కుళ్లుపుట్టిందో ఏమో రిషితేశ్వరి చిరునవ్వును శాశ్వతంగా దూరం చేశారు. తండ్రితో పాటూ చదువంటే తనకెంతో ఇష్టమని, చదువు కోసం ANUకి వస్తే ప్రేమ పేరుతో సీనియర్లు వేధించారని అప్పట్లో రిషితేశ్వరి లేఖ రాసింది. కాగా ఈ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె లేఖ వైరలైంది. 

News November 30, 2024

రిషితేశ్వరి ఆ రోజుల్లో ఎందుకు చనిపోయిందంటే.!

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ANU ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొని 9 ఏళ్లు గడిచింది. సీనియర్స్ చరణ్ నాయక్, శ్రీనివాస్ రిషితేశ్వరిని ప్రేమిస్తున్నాని వెంటపడటంతో అనీషా నాగసాయి లక్ష్మీవారికి సహకరించింది. ఈ క్రమంలోనే 2015 మే 18న ఆ యువకులు ఇద్దరూ రిషితేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని 2015 జులై 14న రిషితేశ్వరి డైరీ రాసి చనిపోయింది. 

News November 29, 2024

గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్

image

బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను  గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.

News November 29, 2024

రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

image

రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

News November 29, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.  

News November 29, 2024

నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ 

image

వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

News November 29, 2024

ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా

image

ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.