India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో గురువారం నాటి ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్, డెలివరీల వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,02,209 గృహ అవసరాల సిలిండర్లు బుక్ అయ్యాయని ఆయన తెలిపారు. కాగా, 1,91,623 డొమెస్టిక్ సిలిండర్లను వినియోగదారులకు డెలివరీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 11,215 కమర్షియల్, 1,484 ఐదు కేజీల చిన్న సిలిండర్లను పంపిణీ చేశామని వివరించారు.

గుంటూరు హత్య కేసు ట్రయల్‌లో సాక్షిగా హాజరైన పావని కోర్టులో స్టేట్‌మెంట్ ఇవ్వకుండా బిగ్గరగా కేకలు వేస్తూ జడ్జి, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్‌కు అంతరాయం కలిగించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 ఫైన్ విధించారు. చెల్లించకపోతే 15 రోజుల సాధారణ శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం గురువారం చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వ్యసనాల బారిన పడకుండా చదువుపై ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చారు.

సీఎం చంద్రబాబు రేపు మంగళగిరి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని సీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గురువారం కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఎస్పీ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక వద్ద ప్రొటోకాల్ అమలు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా పరమైన అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్.. సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

గుంటూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. వీరిద్దరూ గురువారం ఓ నూతన జువెలరీ షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూమ్‌లో డిజైన్లను పరిశీలించిన బాలయ్య యాజమాన్యాన్ని అభినందించారు. తన ప్రియతమ నటుటులను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. రాష్ట్ర గమనాన్ని మార్చే సత్తా లోకేశ్‌కు ఉందని ఆమె కొనియాడారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు దిగ్విజయమయ్యాయని, పార్టీకి కొత్త ఊపిరి పోశారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు.

దేశ రక్షణకు అధునాతన బూట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి అడ్డుకుంటాం అనడం ముమ్మాటికి సైకోయిజమే అని మంత్రి లోకేశ్ X వేదికగా జగన్‌పై ఫైర్ అయ్యారు. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దైవం అంటే ద్వేషం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు. అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం కంపెనీలను వెళ్లగొడతాం ఏమిటి దుర్మార్గపు పనులు అని ప్రశ్నించారు.

పరీక్షల భయంతో పెదనందిపాడు మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చిలకలూరిపేటలో చదువుతున్న ఆమె.. ఫస్ట్ ఇయర్‌లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో ఎలుకల మందు తాగింది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీనిపై పెదనందిపాడు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.45 గంటలకు ఆర్ధిక శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం 04.00 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్షిస్తారు. తిరిగి 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.