Guntur

News April 26, 2024

గుంటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

పట్టణంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధి హిందూ కాలేజ్ వెనక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందిన ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు లాలాపేట స్టేషన్‌‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.  

News April 26, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా  

image

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు స్వయంగా ఆయనకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట పలువురు టీడీపీలోకి చేరారు. డొక్కా ఆశించిన తాడికొండ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరినట్లు సమాచారం. 

News April 26, 2024

నరసరావుపేట: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

పల్నాడు జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 1, 239 మంది హాజరుకాగా, 412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 33.25% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,720 మంది విద్యార్థులు హాజరు కాగా, 1, 549 ఉత్తీర్ణత సాధించారన్నారు. 56.95% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

గుంటూరు పార్లమెంట్ పోటీలో 34 మంది: ఆర్వో

image

గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి నామినేషన్‌ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 34 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సక్రమంగా లేని 13 నామినేషన్లను రిజెక్ట్ చేశామన్నారు. పరిశీలనలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు S.P. కార్తీకా పాల్గొన్నారు. 

News April 26, 2024

తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి షాక్  

image

గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ బషీద్‌కి బీఫామ్ ఇవ్వగా ఆయన నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా నిన్న చివరి నిమిషంలో ఆయనను తప్పించి తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడిని ప్రకటించింది. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నేడు అధికారులు వారి ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. 

News April 26, 2024

MLA శివకుమార్, నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు ఆమోదం

image

తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఇక్కడి బరిలో నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తుంపల నరేంద్ర, అశోక్ కుమార్,జి. రామకృష్ణ, తెలుగు జనతా పార్టీ అభ్యర్థి కె.నాగరాజు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించింది.

News April 26, 2024

పెదకాకానిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. మసీదు సెంటర్ వద్ద షేక్ ముస్తాఫా (35) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద మంచినీరు పట్టేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు డెక్కన్ టుబాకో కంపెనీలో కార్మికుడిగా పని చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు చెప్పారు.

News April 26, 2024

వారం రోజుల్లో 5 సార్లు తనిఖీలు: టీడీపీ

image

తాడికొండ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కారును పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 5 సార్లు తనిఖీ చేశారని చెబుతున్నారు. తాజాగా, గురువారం తాడికొండ అడ్డరోడ్డు వద్ద శ్రావణ్ కుమార్ వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారని మండిపడ్డారు. కాగా, నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.