India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు.
గుంటూరు ఛానల్ ఆధునీకీకరణ, విస్తరణ పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో జిల్లా కలెక్టర్‌ల ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థలో పెండింగ్‌లో ఉన్న యూజీడీ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎంటీఎంసీ పరిధిలో యూజీడీ, తాగునీటి సరఫరాకు సీఆర్డీఏ ద్వారా నిధులు కేటాయిస్తామన్నారు. చినకాకాని, మల్లయపాలెం వద్ద ఇండస్ట్రీ పార్క్‌కు భూసేకరణకు నిధులు మంజూరు చేస్తామన్నారు.
గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి పలు లక్ష్యాలను నిర్ధేశించుకొని కలెక్టర్ నాగలక్ష్మీ సిద్ధం చేసిన ప్రణాళికను బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో వివరించారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా లక్ష్యాలను తెలిపారు. తయారీ రంగంలో 5వేల చిన్న, మధ్యతరహా, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు స్థాపనకు కృషి చేస్తామని, 2 మెగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో గజం రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు పలికిన ధర నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పనులు ప్రారంభం కావడంతో గజం రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు పలుకుతుంది. ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసేవారు కోర్ క్యాపిటల్ ఏరియాలో కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని అదునుగా చూసుకొని రియల్టర్లు అవకాశంగా మలచుకుంటున్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేయాలని ఎస్పీ సతీష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు తదితర నేరాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీసింగ్ లో నూతన వరవడిని సృష్టించాలని సూచించారు. ఏఎస్పీలు సుప్రజ, రమణమూర్తి పాల్గొన్నారు.
ఉగాది పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు.
మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్, మత ప్రబోదకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసు శాఖ, శాంతిభద్రతలపై చర్చ జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖకు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్రణాళికలతో కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.
హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.