India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు పనిచేస్తున్నారు.
తాడేపల్లి పరిధి వడ్డేశ్వరంలోని ఓ కళాశాలలో శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సంతోష్ అనే యువకుడిని విజయవాడకు చెందిన హరికృష్ణ గ్యాంగ్‌తో కలిసి దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారం అయినట్టు న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెలహరి, హైకోర్టు న్యాయ సేవ కమిటీ చైర్మన్ రావు రఘునందన్ రావు శనివారం తెలిపారు. రెండో శనివారం హైకోర్టులో, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోకదాలత్ నిర్వహించబడిందన్నారు. రూ.3,260 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేసినట్టు కార్యదర్శి భబిత తెలిపారు.
నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలతో నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారన్నారు.
మహిళలే సృష్టికి మూలమని మాజీమంత్రి రోజా పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతిభ కనబరుస్తూ, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక మహిళగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి నిలిచారు. ఈమె 2024లో వైసీపీ అభ్యర్థి విడదల రజినిపై 51,150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన ఆమె.. గుంటూరులో ఆసుపత్రిని నడిపిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మాధవి వివిధ సామాజిక సేవా కార్యకలాపాలలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో చురుకుగా పాల్గొంటున్నారు.
దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బిఎస్సి(హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు(1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.
కైవారం బాలాంబ 1849లో తెనాలి అంగలకుదురు గ్రామంలో జన్మించారు. సుబ్బన్నసూరి, వెంకమాంబ ఆమె తల్లిదండ్రులు. ఆమెకు సుబ్బన్నతో వివాహం జరిగింది. కొంతకాలానికి ఆయన మరణించాడు. అనంతరం గ్రామంలో అన్నదానం ప్రారంభించారు. క్రమంగా వందలాది మంది భక్తులకు, బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. మంగళగిరి తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో అన్నపూర్ణ సత్రం ఏర్పాటు చేశారు.
ఇస్రో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో తెనాలికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించారు. గంగానమ్మపేటకు చెందిన కొత్తమాసు సాయిదివ్య, రఘురామ్ దంపతులు ‘ఎన్ స్పేస్ టెక్నాలజీ’ సంస్థను నిర్వహిస్తున్నారు. కేఎల్‌యూలో రాడర్ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సాయిదివ్య 2022 నవంబరులో ఇస్రో పంపిన విక్రమ్-ఎస్ ప్రైవేట్ రాకెట్‌లో ఉంచిన మూడు పేలోడ్‌లలో ఒక పేలోడ్‌ను ఈమె తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది.
Sorry, no posts matched your criteria.