Guntur

News August 2, 2024

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురి అరెస్ట్

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి ఘటనలో మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు కొత్తపేటకు చెందిన బుజ్జిబాబు, ఆదిత్య నగర్‌కు చెందిన సత్యనారాయణ, గుజ్జనగుండ్ల చెందిన మణికంఠను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేశామన్నారు. 

News August 2, 2024

ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్ల రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల(07781), 5 నుంచి 12వ వరకు మాచర్ల-విజయవాడ(07782) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి-విజయవాడ-కాజీపేట మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు గుంటూరు-పగిడి పల్లి మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయన్నారు.

News August 2, 2024

మంగళగిరిలో అగ్నిప్రమాదం.. ఆస్తి నష్టం

image

మంగళగిరి పరిధి గణపతి నగరంలోని మొదటిలో నాగేంద్రం అనే వ్యక్తి అద్దెకి నివసిస్తూ విజయవాడలో బంగారం పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజు మాదిరిగా గురువారం పనికి వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంటిలోని ఏసీ గ్యాస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఆయన నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వస్తువులు మొత్తం దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.18 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

News August 1, 2024

గుంటూరు జిల్లా TOP NEWS

image

➤ గుజ్జనగుండ్లలో శుక్రవారం జాబ్ మేళా
➤ రషీద్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
➤ రూ.1,600 కోట్లు బకాయి పెట్టింది జగన్ కాదా.?: మంత్రి లోకేశ్
➤ నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా చేరుతున్న వరద
➤ ఎయిమ్స్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
➤ 300ల సెల్ ఫోన్‌లు అందించిన GNT ఎస్పీ
➤ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్
➤ నా మొదటి జీతం ప్రజలకే: MLA మాధవి
➤ మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: లోకేశ్

News August 1, 2024

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: నారా లోకేశ్

image

నేడు పింఛన్ల పంపిణీలో భాగంగా మడకశిరలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా CPI(M), ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించగా.. మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. కొందరు పోలీసుల తీరు ఇంకా మారలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.

News August 1, 2024

మంగళగిరిలో పర్యటించిన అమెరికా కౌన్సిల్ జనరల్

image

అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గురువారం మంగళగిరిలో పర్యటించారు. ‘అపురూపమైన మంగళగిరి చేనేత గురించి తెలుసుకుని నిజంగా ఆనందించాన్నారు. సంప్రదాయాలు, క్లిష్టమైన హస్తకళ, గొప్ప చరిత్ర ప్రతి భాగాన్ని నిజంగా ప్రత్యేకంగా చేస్తాయన్నారు. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని చూడటం అద్భుతమని ట్వీట్ చేశారు.

News August 1, 2024

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు గారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా’ అని ట్వీట్ చేశారు.

News August 1, 2024

మంగళగిరి: చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

image

మంగళగిరి మండలం, ఎర్రబాలెం చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబాలెం చెరువులో స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 1, 2024

శ్రీశైలం పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

image

ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. 10.30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లి.. సాక్షి గణపతి, వీర భద్ర స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి వాయనం సారె సమర్పించనున్నారు.

News August 1, 2024

ఎయిమ్స్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఎయిమ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌ డైరక్టర్‌, సీఈఓ ప్రొఫెసర్‌ మధభానందకర్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌తో కలసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎయిమ్స్‌ విస్తరణకు కొలనుకొండలో ఉన్న భూములను పరిశీలించి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.