Guntur

News June 24, 2024

గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజకుమారి

image

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎం. వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో ఆయన స్థానంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగలక్ష్మిని నియమించారు. ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 24, 2024

ఎంపీగా తెలుగులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం లోక్ సభలో ప్రమాణస్వీకారం చేశారు. మాతృభాష అయిన తెలుగులోనే ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆయనతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఆయన అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో గుంటూరు జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

News June 24, 2024

ANU: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్(BA, BCom, BCA, BAOL) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చంది.

News June 24, 2024

నరసరావుపేట: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నరసరావుపేటలోని ఓ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. చందు అనే యువకుడు అదే ప్రాంతంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్టేషన్ ఎస్సై రోశయ్య కేసు నమోదు చేశారు.

News June 24, 2024

నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

image

మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నారా లోకేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్ర క్యాబినెట్లో లోకేశ్‌కి స్థానం దక్కింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన ఛాంబర్‌లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరించనున్నారు.

News June 23, 2024

విధుల నుంచి రిలీజ్ అయిన గుంటూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి చార్జీని అప్పగించారు. విజయనగరం జిల్లా నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఎస్.నాగలక్ష్మి బుధవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 23, 2024

బాపట్ల యువకుడు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం

image

అమెరికాలో బాపట్ల నియోజకవర్గానికి చెందిన యువకుడు దాసరి గోపికృష్ణ మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. యువకుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. దుండగుల దాడి ఘటనలో గోపికృష్ణ మృతి చెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News June 23, 2024

నాదెండ్ల మనోహర్‌ను కలిసిన మాజీ ఎంపీ జయదేవ్

image

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదివారం గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనోహర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.