Guntur

News July 28, 2024

మంగళగిరి: ANUలో రేపు ఐసెట్ కౌన్సెలింగ్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంబీఏ జనరల్, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు నిర్వహించిన ఐసెట్‌లో అర్హత సాధించిన వారికి సోమవారం కౌన్సెలింగ్ ఏర్పాటుచేశామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు.  ఎంబీఏలో 10, ఎంసీఏలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ANU ఐసెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా రేపు ఉదయం పీజీ ప్రవేశాల విభాగానికి రావాలని చెప్పారు. 

News July 28, 2024

ఇంజినీరింగ్ పనులు కారణంగా ఆలస్యంగా నడవనున్న రైళ్లు

image

గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఆగస్ట్ 12,13 తేదీల్లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని గుంటూరు రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నం.17646 240 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుందన్నారు. 11వ తేదీన సంత్రగచ్చి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 13వ తేదీన సికింద్రాబాద్-సంత్రగచ్చి మధ్య నడిచే రైలు వరంగల్, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో నడపనున్నారు. 

News July 28, 2024

గుంటూరు: ‘ప్రతి PS పరిధిలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలి’

image

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి, వాటి ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News July 27, 2024

జర్నలిస్టులకు సీఎం, డిప్యూటీ సీఎం హామీ

image

జర్నలిస్టులపై దాడులు, బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు, పవన్‌లు స్పందించారు. తాడేపల్లిలో శనివారం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అది పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతరం జర్నలిస్టులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News July 27, 2024

యువతకు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. అమరావతిలో నిర్మాణ, సర్వే రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. నిర్మాణ రంగానికి ఎలాంటి నైపుణ్యం గల వారు కావాలో తెలుసుకుని సిద్ధం చేయాలన్నారు.

News July 27, 2024

గుంటూరు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

గుంటూరు ఏ.టీ అగ్రహారం 7వ లైన్‌లో రేపు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలు జరగనున్నాయని సేవా సమితి అధ్యక్షుడు రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనిరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు ఆహ్వానించారు. 28న ఆదివారం కల్యాణ మహోత్సవం, 29వ తేదీన ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీహరి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.

News July 27, 2024

రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు

image

వినుకొండలో రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు, నిందితుడి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హత్యకు ముందు నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో కలిసి మద్యం తాగి, హత్యకు సిద్ధమైనట్లు రిపోర్టులో వివరించారు. హత్య జరుగుతున్న సమయంలో నిందితులు కర్రలతో కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 27, 2024

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి

image

గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన భారతరత్నతో సహా అనేక అవార్డులు అందుకున్నారన్నారు. అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నారు.

News July 27, 2024

రాజధాని పనులపై డ్రోన్ వీడియో చిత్రీకరణ!

image

రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని డ్రోన్ ఫొటో కమ్ వీడియో చిత్రీకరణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. గత, ప్రస్తుత ఫుటేజీ ఆధారంగా అధ్యయనం చేయాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. రాజధాని పనులను ఈ కమిటీ శుక్రవారం పరిశీలించింది. ప్రాథమిక అవగాహన కోసం.. పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఆనందరావు నేతృత్వంలోని ఇంజినీరింగ్ టెక్నికల్ కమిటీ రాజధాని ప్రాంతాన్ని జల్లెడ పట్టింది.

News July 27, 2024

జగన్‌పై ఎమ్మెల్యే జీవీ ఆగ్రహం

image

వినుకొండలో హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటని స్థానిక MLA జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. రషీద్ హత్యను తన కుటుంబానికి అంటగట్టడం దారుణమన్నారు. అలాగైతే, వివేకా హత్య కేసు నిందితుడు YS భారతితో సెల్ఫీ దిగాడని, జగన్ దానికేం చెబుతారని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తామని జీవీ చెప్పారు. రషీద్, నిందితుడు జిలానీ.. బొల్లా అనుచరులే అని వివరించారు.