India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాలపై కచ్చితంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారన్నారు. వారిద్దరూ YCP కార్యకర్తలేనా అని మీడియా అడగ్గా.. ఇవన్నీ పిచ్చిమాటలని వినుకొండలో అందరికీ తెలిసిన విషయమేనని, హత్య చేసిన వ్యక్తి TDPలోనే ఉన్నాడని, మొన్న ఆ పార్టీ గెలుపుకై పోరాడిన విషయం తెలిసిందేనన్నారు.
వైసీపీ అధినేత YS జగన్ కార్యకర్త రషీద్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట వినుకొండ చేరుకున్న ఆయన మృతుడు రషీద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరికాసేపట్లో జగన్ మీడియాతో మాట్లాడనుండగా.. ఏం మాట్లాడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసిన రైళ్లను 21వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు-డోన్ (17228), నర్సపూర్-గుంటూరు (17282)రైళ్లను ఈనెల 21వ నుంచి, డోన్-గుంటూరు (17227), గుంటూరు-నర్సపూర్ (17281) రైళ్లు ఈ నెల 22వ తేదీ నుంచి పాత సమయాల ప్రకారం యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
కీటక జనిత సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో ఆయన వైద్యశాఖ, మున్సిపల్, వాటర్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్, దోమల నివారణ మందులు స్ప్రే చేయాలని సూచించారు. రహదారులపై నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సత్వర వైద్య సేవలు అందించాలని సూచించారు.
గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్ తాడేపల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రతను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం వరకు దారి వెంట విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, వారి యెగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, తదితర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన హత్య ఘటన దురదృష్టకరం అని నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పార్టీలకు అతీతంగా ఈ సంఘటనను అందరూ ఖండించాలన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయకుండా బాధితుడి కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నానన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేయనుంది.
బాపట్ల పట్టణంలోని త్రవ్వు కాలువ మరమ్మతులు చేస్తుండగా గురువారం JCB అదుపుతప్పి తిరగబడింది. ఒక్కసారిగా తిరగబడటంతో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
రేపు వినుకొండకు YCP అధినేత జగన్ రానున్నట్లు తెలుస్తోంది. వినుకొండలో గత రాత్రి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండకు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు. రషీద్ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన బొల్లాకు జగన్ కాల్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.