India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెరగడంతో గుంటూరు జిల్లాలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. GST, ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో ప్యాకెట్ల ధరలు రూ.20 నుంచి రూ.50వరకు అధికమయ్యాయి. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇంకా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణానికో రేటు ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ చర్యలతో ధూమపానం తగ్గించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, MPDOలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని అన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు శ్రద్ధ పెట్టాలన్నారు.

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా నీరు, పారిశుద్ద్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బోరు బావులు మరమ్మతులు 24 గంటల్లో పూర్తి చేయుటకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచాలన్నారు.

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.

Sorry, no posts matched your criteria.