India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లాలో 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న శారీరక విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 25న జరగనుంది. బృందావన్ గార్డెన్స్ 1వ లైనులో ఉదయం 10గంటల నుంచి ఎంపిక కమిటీ ద్వారా ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు N వెంకరమణప్ప తెలిపారు. దరఖాస్తు చేసుకొని ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.

అమరావతికి అసలైన మణిహారం సిద్ధమవుతోంది. రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవుతో, 75 మీటర్ల భారీ వెడల్పుతో ఈ రహదారిని డిజైన్ చేశారు. ఇది 8+4 వరుసల (Lanes) కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. అంటే ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉంటే, స్థానిక రవాణా కోసం అధనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉంటాయి.

PCC అధ్యక్షురాలు YS షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఆమె పాదయాత్రలో భాగంగా ఉదయం తెనాలి చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా BJP ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా భక్తుల ప్రయాణం భారీగా పెరిగింది. స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా
మహిళలు శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, గోవాడ వంటి శైవక్షేత్రాలకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని 5 డిపోల నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. 2 రోజుల్లో 1.70 లక్షల మందికి పైగా మహిళలకు జీరో టిక్కెట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందన్నారు.

వేదపాఠశాల విద్యార్థి అదృశ్యమైనట్లు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల (D) సంతమాగులూరు (M) మిన్నెకల్లుకు చెందిన పదిహేనేళ్ల తుర్లపాటి వెంకటసాయి రమేశ్ ఎండ్రాయి వేదపాఠశాలలో చదువుతున్నాడు. రెండ్రోజుల కిందట పాఠశాల నుంచి గుంటూరు శ్రీనగర్‌లోని అమమ్మ ఇంటికి వచ్చాడు. 18న లాడ్జిసెంటర్‌లో ఆటో ఎక్కి కనిపించకుండా పోయాడు. విద్యార్థి తల్లి పద్మప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్‌బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్‌లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్‌బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. 5/5 బీ ఆర్కిటెక్చర్ 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈ నెల 27వ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం నూతనంగా 5 డిప్లమా కోర్సులతో ముందడుగు వేస్తుందని CDE డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో ANU, అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం అవగాహన ఒప్పంద కుదిరింది. సంబంధిత పత్రాలపై రిజిస్ట్రార్ సింహాచలం, కంపెనీ సీఈవో సుకుమార్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో VC గంగాధరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

CM చంద్రబాబు ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో కలసి తపాలా శాఖ ఉద్యోగుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిట్యువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో 22న మధ్యాహ్నం నుంచి కార్యక్రమం జరగనుంది. కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా , జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, తపాలా శాఖ అధికారులతో ఏర్పాట్లు పరిశీలించారు.

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.