Guntur

News February 16, 2026

రాజధానిలో రాత్రి వేళ అందని వైద్యం..!

image

తుళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రాత్రైతే వైద్యులు ఉండటంలేదని రోగులు అంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులతో పాటు స్థానిక ప్రజలు రాత్రివేళలో వైద్యశాలకు వెళితే సరైన వైద్యం అందించే నాధుడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో ఆరోగ్య కేంద్రం వైద్యానికి దూరంగా ఉంటుందంటున్నారు. సమస్యపై ప్రజా ప్రతినిధులకు ఏ కరువు పెట్టినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

News February 16, 2026

జిల్లాలో 4,71,937 మంది బాలలకు మాత్రలు అందిస్తాం: DMHO

image

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 4,71,937 మంది బాలబాలికలకు మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కే విజయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా మాత్రలు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు తీసుకోవాలని సూచించారు. 17న తీసుకోని వారు 24న మాప్-అప్ రౌండ్‌లో తప్పక తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News February 16, 2026

మంగళగిరి: ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు

image

ఘాట్ రోడ్‌లో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కొండ వెనుక ఉన్న ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు చేసినట్లు దేవస్థాన అధికారి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం గండాలయ్య స్వామి దర్శనానికి కొండ వెనుక ఘాట్ రోడ్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామన్నారు. కొండపై ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

News February 16, 2026

ప్రైవేటు ఆసుపత్రులకు 30 రోజులే గడువు: DMHO

image

జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, రక్తపరిక్ష, స్కానింగ్ కేంద్రాలు తమ వైద్యుల HPR IDలు, సంస్థల HFR IDలను డీఎంహెచ్ఓ కార్యాలయంలో నమోదు చేయాలని గుంటూరు DMHO డా.కె.విజయలక్ష్మి తెలిపారు. 30 రోజులలోపు నమోదు పూర్తి చేయని సంస్థల లైసెన్సులు చెల్లనివిగా భావింపబడతాయని హెచ్చరించారు. సందేహాల నివృత్తి కోసం నేరుగా DMHO కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News February 16, 2026

హాట్ టాపిక్‌గా బిల్‌గేట్స్ పర్యటన..!

image

బిల్‌గేట్స్ ప్రయాణించిన వండర్ జెట్ విశేషాలు అమరావతిలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. రూ.650 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ G650ERలో ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుని, ప్రత్యేక వాహనంలో అమరావతి గడ్డపై అడుగుపెట్టారు. ఆయన ప్రయాణించిన వాహనం ఇంధనం నింపకుండానే ఒకేసారి సుమారు 13,890 కిలోమీటర్ల దూరం నాన్-స్టాప్‌గా ప్రయాణించగలదు. దీనిలో 19 మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీటింగ్, విశ్రాంతి గదులు, గ్యాలరీ ఉంటుంది.

News February 16, 2026

గుంటూరులో ఫలితాలలో షాక్.. D గ్రేడ్‌‌లో 2,123 మంది విద్యార్థులు

image

SSC 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 ఫలితాల్లో గుంటూరు జిల్లా మిశ్రమ ఫలితాలు సాధించింది. మొత్తం 10,332 మంది విద్యార్థుల్లో 568 మంది A గ్రేడ్, 2,239 మంది B గ్రేడ్, 4,912 మంది C గ్రేడ్ సాధించగా, 2,123 మంది D గ్రేడ్‌లో నిలిచారు. D గ్రేడ్ శాతం గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ 46 పరీక్షల మూల్యాంకనం ద్వారా మెరుగుదలపై దృష్టి సారించింది.

News February 16, 2026

శాఖల సమన్వయం.. ప్రశాంతంగా మహాశివరాత్రి తిరునాళ్లు

image

శివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శివాలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎండోమెంట్స్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్యశాఖ, RTC అధికారుల ప్రణాళికలు, సమన్వయంతో తిరునాళ్లు విజయవంతమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు ఫలించి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు.

News February 16, 2026

అమరావతి నిర్మాణానికి బిల్ గేట్స్ కితాబు

image

రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రేట్ వర్క్ అంటూ గేట్స్ కితాబిచ్చారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజెంటేషన్లను బిల్ గేట్స్ పరిశీలించారు.

News February 16, 2026

17న డీ వార్మింగ్ డే: GNT DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు DMHO విజయ లక్ష్మి  తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.

News February 16, 2026

GNT: శివరాత్రి వేళ ప్రత్యేక ఆకర్షణగా ‘పొట్టేళ్ల ప్రభ’

image

మహాశివరాత్రిని పురస్కరించుకొని పొన్నూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పొట్టేళ్ల ప్రభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెలగపాలెంకు చెందిన బోడి రామారావు కుటుంబం గత 13 ఏళ్లుగా పొట్టేళ్లను ప్రత్యేకంగా పెంచి, ఈ ప్రభను సిద్ధం చేస్తోంది. సంప్రదాయం ప్రకారం పొన్నూరు నుంచి కట్టెంపూడిలోని సంగమేశ్వరస్వామి ఆలయం వరకు ఈ ప్రభను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.