Guntur

News June 11, 2024

గుంటూరు జిల్లాలో పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.

News June 11, 2024

నాగార్జున యూనివర్సిటీలో వేసవి సెలవులు పొడిగింపు

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగించారు. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా.. విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కరుణ సోమవారం తెలిపారు. ఈనెల 14 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.

News June 11, 2024

నేడు విజయవాడలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం

image

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.

News June 10, 2024

పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయింపు

image

గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా ఆయన్ను నియమించారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖ‌ర్‌ దిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

News June 10, 2024

గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడి రాజీనామా

image

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు బోద్దులూరి రంగారావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తనకు పదవి ఇచ్చారని, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పత్రాన్ని జిల్లా అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

News June 10, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కేంద్ర మంత్రులు వీరే 

image

రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గతంలో ఉద్దండులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. తాజా మంత్రి వర్గంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, పాములపాటి అంకినీడు ప్రసాద్, పనబాక లక్ష్మి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జేడీ శీలం, కొత్తపల్లి రఘురామయ్య జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా పని చేశారు.  

News June 10, 2024

గుంటూరు: మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

image

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్‌ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా బాబాయ్‌ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

News June 10, 2024

అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

image

‘అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం తెలుగు విద్యార్థి నేతలు గాజులు, చీరలతో అంబటి రాంబాబు నివాసం వద్దకు వెళ్లారు. కుర్చీపై అంబటి ఫొటో, గాజులు, చీర పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అంబటి రావాలని పిలిచేందుకు వచ్చామని అన్నారు. 

News June 10, 2024

గుంటూరు: సబ్జెక్టులు మిగిలాయని విద్యార్థి ఆత్మహత్య

image

పర్చూరు మండలం రామనాయపాలెంకి చెందిన వంశీకృష్ణ దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు మిగిలాయని ఆదివారం చింతలపూడి కళాశాల సమీపంలోని ఓ పూరి గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News June 10, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కేంద్ర మంత్రులు వీరే 

image

రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గతంలో ఉద్దండులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. తాజా మంత్రి వర్గంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1974లో కాసు బ్రహ్మానంద రెడ్డి, 1979లో పాములపాటి అంకినీడు ప్రసాద్, 2004లో పనబాక లక్ష్మి, 2009లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు.