Guntur

News June 7, 2024

చంద్రబాబుతో MPలు.. ఫొటో షేర్ చేసిన కృష్ణదేవరాయలు

image

నరసరావుపేట టీడీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాయలు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీలుగా గెలిచిన వారందరూ ఉన్నారు. ప్రధానితో ఎన్డీఏ భాగస్వాముల భేటీలో పాల్గొనేందుకు ఎంపీలంతా చంద్రబాబుతో కలిసి దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

News June 7, 2024

YCP మాజీ MLA ఆర్కే స్వగ్రామంలో TDPకి మెజారిటీ

image

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.

News June 6, 2024

గుంటూరు: ఇంటిలో కుళ్లిన మృతదేహం లభ్యం

image

పట్టణంలోని ఓ ఇంట్లో కుళ్లిన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. నగరంపాలెం స్టాల్ హై స్కూల్ ఎదురుగా ఓ ఇంటిలో నుంచి దుర్వాసన రాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడు రాంబాబుగా గుర్తించామన్నారు. అనారోగ్య కారణాలతో చాలా రోజుల కిందట చనిపోయినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

News June 6, 2024

గుంటూరు: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి

image

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

News June 6, 2024

బాపట్ల జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం: కలెక్టర్, ఎస్పీ

image

బాపట్ల జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ రకుల్ జిందాల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఇరువురు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన అధికారులకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నిధులు చెల్లించడం జరిగిందన్నారు.

News June 6, 2024

అదృష్టం ఉంటే మంత్రి పదవి: ఎమ్మెల్యే నజీర్

image

అదృష్టం ఉంటే తనకు మంత్రిత్వ శాఖ దక్కుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం, జగన్ పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు.

News June 6, 2024

టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ

image

సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులకు తొలుత ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

News June 6, 2024

తాడేపల్లి: లోకేశ్‌ను కలిసిన అచ్చెన్నాయుడు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా అచ్చెన్నాయుడు కలిశారు. గురువారం తాడేపల్లి (M) ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవటం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

News June 6, 2024

తాడేపల్లి: చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

తాజా ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్న చంద్రబాబుకు పోలీసులు భద్రతను పెంచారు. తాడేపల్లి (M) ఉండవల్లి గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తూ భద్రతను మరింత పెంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

News June 6, 2024

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల రాష్ట్ర సిలబస్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజాంపట్నం గురుకులపాఠశాల కన్వీనర్ వై. నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. నక్షత్రనగర్, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.