India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంగళగిరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి షేక్. సలీమ్ భాష ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతను డీఈవో పరిశీలించారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలని సూచించారు.

అమరావతిలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& సైన్స్(బిట్స్) సంస్థ క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయంటూ మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. కాగా మందడం, వెంకటపాలెంలో క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మిస్తుండగా..AI, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా మారుతోందని లోకేశ్ పేర్కొన్నారు.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను గురువారం కలిశారు. పాదయాత్ర సాగిన తీరును మంత్రి అడిగి తెలుసుకొని, శ్రీవారి ప్రసాదం స్వీకరించారు. YCP హయాంలో చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ కావడంతో.. ఆయన విడుదలను కాంక్షిస్తూ షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తానని గణేశ్ మొక్కుకున్నారు. కాగా 23 రోజుల పాటు పాదయాత్ర చేసి శ్రీవారి మొక్కు చెల్లించుకున్నారు.

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

వెలగపూడి అసెంబ్లీ వద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తును గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తత తనిఖీల విధానం పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఏమైనా అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులు గుర్తించినట్లయితే వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబుకు, పార్టీ అధిష్ఠానానికి సంజీవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర అనుభవాలను సీఎం అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఆయన సీఎంకి అందించారు. .

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలోఅమలు పక్కాగా ఉండాలని, అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

అమరావతిని ప్రాంతీయ సమీకృత వృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో విజయవాడ–గుంటూరు–అమరావతి ప్రాంతాన్ని లాజిస్టిక్స్, పరిపాలన, నైపుణ్యాల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాజధానిని అనుసంధానించి టైర్-2 పట్టణ సముదాయంగా రూపుదిద్దుతామని పేర్కొన్నారు. పునర్నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.

కృష్ణా నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమరావతి సమీపంలో భారీ మెరీనా నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. వెంకటపాలెం వద్ద పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో వినోదం, బోటింగ్, క్లబ్ హౌస్‌లు, గెస్ట్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నదీ తీరాన్ని ఆకర్షణీయంగా మార్చి దేశీయ-విదేశీ పర్యాటకులను రప్పించాలన్నది ఉద్దేశం. టెండర్ ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
Sorry, no posts matched your criteria.