Krishna

News July 9, 2025

కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

image

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!

News July 9, 2025

కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు

image

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)లకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మొత్తం 66 పీఏసీఎస్‌లకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా ఒకరు, సభ్యులుగా ఇద్దరిని నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈఓ, కార్యదర్శులు పని చేయనున్నారు. పీఎసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ కమిటీలు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 8, 2025

నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

image

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.

News July 8, 2025

మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

image

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన

News July 7, 2025

మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.

News July 7, 2025

మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News July 7, 2025

నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.

News July 7, 2025

మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

image

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.