Krishna

News April 12, 2025

కృష్ణా: ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీల స్వయం ఉపాధికై బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10వ తేదీలోపు https:///apobmms.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

News April 12, 2025

కృష్ణా: కంప్యూటరీకరణ ద్వారా మూల్యాంకనం 

image

మార్చి నెలలో జరిగిన కృష్ణా యూనివర్శిటీ B.Ed 1వ సెమిస్టర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కంప్యూటరీకరణ ద్వారా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కంప్యూటరైజ్డ్ మూల్యాంకనాన్ని శనివారం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ప్రారంభించారు. ఈ పద్ధతి వల్ల ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని, ఫలితాలు త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఉపకులపతి చెప్పారు. 

News April 12, 2025

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో నాడు.. నేడు.. స్టేట్ ఫస్టే

image

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మళ్లీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84% ఫలితాలు రాగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణులయ్యారు. నేడు విడుదలైన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 85%, ద్వితీయ సంవత్సరంలో 93% మంది ఉత్తీర్ణులయ్యారు. 

News April 12, 2025

మోపిదేవి: డీజీపీని కలిసిన ఎస్పీ గంగాధర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. డీజీపీతో కలిసి ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ విద్యశ్రీ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

News April 12, 2025

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్

image

ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్‌ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2025

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు

image

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్‌లో కృష్ణాజిల్లా 54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 75% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 4వ స్థానంలో నిలవడం విశేషం.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. సత్తా చాటిన కృష్ణా విద్యార్థులు

image

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 19,133 మంది పరీక్షలు రాయగా 17,708 మంది పాసయ్యారు. 93 శాతం పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 23,219 మందికి 19,743 మంది పాసయ్యారు.  85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది.

News April 12, 2025

కృష్ణా: నేడు ఫలితాల కోసం ఎదురుచూపులు..!

image

కృష్ణా జిల్లాలో 45,456 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 24,571 మంది ఫస్టియర్‌, 20,885 మంది సెకండియర్‌ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

News April 12, 2025

VJA: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

image

ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

News April 12, 2025

కృష్ణా: ‘నేటి నుంచి ధాన్యం కేంద్రాలు ఓపెనింగ్’

image

2024-25 పంట కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలు శనివారం నుంచి జిల్లాలో తెరిచి ఉంటాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు.