Krishna

News March 2, 2026

కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

image

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

image

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 1, 2026

అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

image

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.

News February 28, 2026

కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

image

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.

News February 28, 2026

కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

News February 28, 2026

కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

image

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.

News February 28, 2026

మినుము, పెసల కొనుగోలుకు సర్వం సిద్ధం: కృష్ణా జిల్లా జేసీ

image

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ శుక్రవారం ప్రకటించారు. క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ. 8,768 మద్దతు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారానే విక్రయాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News February 27, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు: కృష్ణా SP
* ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను పరామర్శించిన లక్ష్మీపార్వతి
* ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదని పేరెంట్స్ ఆవేదన
* మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన పోలీసులు
* CRDA కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
* బాపులపాడు డిప్యూటీ MPDOపై సస్పెన్షన్ వేటు
* గన్నవరం ఎయిర్పోర్ట్‌లో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

News February 27, 2026

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు: కృష్ణా ఎస్పీ

image

న్యాయవ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం
ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. ఇటీవల సైబర్ నేరగాళ్ల చెర నుంచి పోలీసుల సాయంతో బయటపడ్డ వృద్ధ దంపతులను అభినందించారు. జిల్లావ్యాప్తంగా దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

News February 27, 2026

ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

image

ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.