India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఆ అధికారి స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (GGH) అధికారుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. చిన్నపాటి మరమ్మతులు ఉన్న బెడ్లు, పాత ఇనుప సామాన్లను పక్కకు తొలగించకుండా ఓపీ నుంచి సర్జికల్ వార్డులకు వెళ్లే ప్రధాన మార్గంలోనే కుప్పగా వదిలేశారు. దీంతో రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలకి నెలకు రూ.15-20 లక్షలు ముట్టజెప్పి వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 300 టన్నులకు పైగా పేదల బియ్యం నల్ల బజార్‌కి వెళ్తున్నాయి. స్థానిక మిల్లులోనే పాలిష్ పట్టి సాధారణ బియ్యంలా కాకినాడ పోర్టుకి తరలిస్తున్నట్లు సమాచారం. MTM, పామర్రు,పెనమలూరు కేంద్రాలుగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్నా.. అధికారుల దాడులు మమ అనిపించేలా ఉంటున్నాయి.

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి UV సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంటాయని, అనధికారిక సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. bre.ap.gov.in, Mana Mitra WhatsApp Governance 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ దుర్గాంజనేయులు తెలిపారు.

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం

కృష్ణా జిల్లాలో వరి పొలాలు అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ పరిధిలో వందల ఎకరాల సాగు భూములతో పాటు మడ అడవులను సైతం ఆక్రమించి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుల వ్యర్థ నీరు కాలువల్లోకి వదులుతుండటంతో పక్కనే ఉన్న పంట పొలాలు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ఇవి జరుగుతున్నాయని టాక్.

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం గణితం పరీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 15,100 మంది విద్యార్థులకు గాను 14,845 మంది హాజరయ్యారని, 255 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సరళాదేవి తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
Sorry, no posts matched your criteria.