Krishna

News August 30, 2024

కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(A-21, A-22, A-23& C-21, C-22,C-23 బ్యాచ్‌లు) రాయాల్సిన 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు http://anucde.info/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News August 30, 2024

విజయవాడలో రేపటి నుంచి జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక

image

విజయవాడ PVS పబ్లిక్ స్కూల్‌లో శనివారం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి బి. నాగలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్ 14, 16, 18, 20, 23 కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఎంపిక పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఉమ్మడి కృష్ణా జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యాలయంలో సంప్రదించాలని నాగలక్ష్మి సూచించారు.

News August 30, 2024

జనవరి 6న తుది ఫోటొ ఓటర్ల జాబితా: గీతాంజలి శర్మ

image

‘ఫోటొ ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025’ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా JC గీతాంజలి శర్మ తెలిపారు. ఈ అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ.. త్వరలో సమగ్ర ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు నవంబర్ 28 వరకు స్వీకరించి, 2025 జనవరి 6న తుది ఫోటొ ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు BLOలను అందుబాటులో ఉంచుతామని JC చెప్పారు. 

News August 30, 2024

31 నుంచి అథ్లెటిక్స్‌ జిల్లా జట్ల ఎంపిక

image

ఉమ్మడి కృష్ణా జిల్లా అథ్లెటిక్స్‌ జట్లను ఈ నెల 31, సెప్టెంబర్‌ ఒకటో తేదీన విజయవాడలోని వీపీ సిద్ధార్ధ స్కూల్‌ గ్రౌండ్‌లో ఎంపిక చేస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి నాగలక్ష్మీ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన దృవీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలతో ఎంపిక ప్రాంగణంలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపిక అయితే రాష్ట్ర పోటీలకు వెళ్తారన్నారు.

News August 29, 2024

ముంబై నటి జెత్వానీ కేసుపై హోంమంత్రి స్పందన

image

ముంబై నటి జెత్వానీ కేసుపై హోంమంత్రి అనిత స్పందించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. బాధితురాలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. విచారణ కోసం మహిళా అధికారిని నియమించినట్లు తెలిపారు. తప్పుచేస్తే అధికారులతో సహా ఎవరినీ వదిలిపెట్టం అని వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తాం అని పేర్కొన్నారు. దిశ పీఎస్‌లను మహిళా పీఎస్‌లుగా వినియోగిస్తాం ఆమె సృష్టం చేశారు. 

News August 29, 2024

కృష్ణా: BA.LLB పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని BA.LLB 2వ సెమిస్టర్(Y19 నుంచి Y23 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 2లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 29, 2024

ఇంద్రకీలాద్రిపై హుండీ లెక్కింపు పూర్తి

image

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై హుండీ లెక్కింపు చేపట్టారు. 14 రోజులకు రూ.2,76,66,261 నగదు, 523 గ్రాముల బంగారం, ఏడు కేజీల 30 గ్రాముల వెండి భక్తులు సమర్పించినట్లు ఈవో లీలా కుమార్ తెలిపారు. యూఎస్‌కు చెందిన 327 డాలర్లు, ఆస్ట్రేలియా 35 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పౌండ్లు, కెనడా ఐదు డాలర్లు, ఖతార్ 98 రియాల్స్ భక్తులు సమర్పించారు.

News August 29, 2024

VJA: హీరోయిన్ కేసు దర్యాప్తులో మరో ముందడుగు 

image

ముంబై హీరోయిన్ జెత్వానీ కేసుపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమెతో ఆన్‍లైన్‍లో ఫిర్యాదు తీసుకోవాలని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా విజయవాడ సీసీఎస్ ఎసీపీ స్రవంతి రాయ్‌ను నియమిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణంగా దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News August 29, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(2023-24 విద్యా సంవత్సరం) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. 

News August 29, 2024

కృష్ణా: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాలరీత్యా విజయవాడ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.