Krishna

News February 10, 2026

కృష్ణా: సంక్షోభంలో ఇటుక పరిశ్రమ..!

image

కృష్ణా జిల్లాలో ఇటుక పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు మందగించడంతో ఇటుకలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. లక్షల ఇటుకలు నిల్వ ఉన్నా కొనేవారు లేరు.. అప్పులు తెచ్చి బట్టీలు నడుపుతున్నాం అని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. అమ్మకాలు లేక, ఆదాయం రాక వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

News February 9, 2026

మచిలీపట్నంలో ‘వందేమాతరం’ కోస్టల్ సైక్లోథాన్ ప్రారంభం

image

మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో CISF ఆధ్వర్యంలో సోమవారం ‘వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ మెగా సైకిల్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ సుమారు 6,500 కి.మీ మేర సాగే ఈ భారీ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంత భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.

News February 9, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 152 అర్జీలు

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్‌కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.

News February 9, 2026

బందరు పోర్టుకు ‘షిప్‌ బిల్డింగ్‌’ కళ.. ఎంపీ బాలశౌరి హర్షం

image

మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బందరు పోర్టు రూపురేఖలను మార్చివేస్తుందని, దీనివల్ల పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News February 9, 2026

కృష్ణా: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలంటూ జేసీకి వినతి

image

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని వైసీపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలార్ దాదా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంజుమన్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు అని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 9, 2026

కృష్ణా: ‘ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి’

image

జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో RBI ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు.

News February 9, 2026

కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

image

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 9, 2026

MTM: బాల్య వివాహా ముక్తి రధాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ICDS ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బాల్య వివాహా ముక్తి రధాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ICDS PD రాణి, DCPO కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

News February 8, 2026

రేపు మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News February 8, 2026

కృష్ణా జిల్లాలో నాన్‌వెజ్ ధరలు ఎంతంటే..?

image

కృష్ణా జిల్లాలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌‌ లెస్ కేజీ రూ. 280, స్కిన్‌ రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153కు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.