Krishna

News February 4, 2026

త్వరలో చల్లపల్లి మండలంలో సీఎం చంద్రబాబు సభ

image

CM చంద్రబాబు త్వరలో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం సభ నిర్వహణకు అనువైన స్థలాల ఎంపికకు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మంగళవారం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్, మేకావారిపాలెంలో పీఏసీఎస్ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ పొలం, చల్లపల్లి రాజా హైస్కూల్ గ్రౌండ్, పాగోలు ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ పరిశీలించారు. తేదీ ఖరారు కాగానే స్థలం ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు.

News February 3, 2026

గన్నవరం: విద్యార్థులకు గుడ్ న్యూస్

image

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

News February 3, 2026

కృష్ణా జిల్లా రైతుల్లో కలవరం..!

image

కృష్ణా జిల్లాలో అపరాల సాగు కీలక దశకు చేరుకోగా, ఎలుకల బెడద రైతులను వణికిస్తోంది. పూత, కాయ దశలో ఉన్న పంటను మూషికాలు కొరికి నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యల కోసం గతంలో కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి, ఎలుకల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

News February 3, 2026

కృష్ణా: ఈ నెల 16 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజు గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4, 6వ సెమిస్టర్‌కు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులపై వర్సిటీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ నెల 16వ తేదీ లోపు తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. అనంతరం 17వ తేదీ వరకు ప్రిన్సిపల్స్ యూనివర్సిటీ పోర్టల్‌లో ఫీజును జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో 21, 24, 27 తేదీల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.

News February 3, 2026

రాష్ట్రస్థాయిలో కృష్ణా జిల్లా విద్యార్థి ప్రతిభ

image

కృష్ణ జిల్లా గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని అమీనా తబుసం రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. నెల్లూరులోని ఎస్‌వీ సుబ్బారెడ్డి స్టేడియంలో జనవరి 27న నిర్వహించిన 8వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో ఆమె ప్రథమ స్థానం సాధించింది. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.

News February 3, 2026

పరిశ్రమల స్థాపనలో సంస్థాగత ఇబ్బందులను అధిగమించండి: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనలో సంస్థాగతంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారులతో సమావేశమైన ఆయన పరిశ్రమల స్థాపనపై చర్చించారు. జిల్లాలో 237 పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చినప్పటికీ సంస్థాగతంగా నెలకొన్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.

News February 2, 2026

కృష్ణా: ‘విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

image

పెనమలూరు నియోజకవర్గం పోరంకి BJR నగర్‌లోని చైతన్య విద్యా సంస్థల్లో పవన్ అనే విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRSలో జిల్లా అధ్యక్షులు పూజిత, కార్యదర్శి సమరం కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. తోటి విద్యార్థుల ముందు పవన్‌ను ప్రిన్సిపల్ అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని SFI నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

News February 2, 2026

మానవ తప్పిదాలతో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించాలి: కలెక్టర్

image

మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ యాక్సిడెంట్ కేసులు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

News February 2, 2026

పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు వేగం పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు వేగంగా కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనపై సమీక్ష సమావేశం నిర్వహించి, 237 యూనిట్లకు అనుమతులు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలతో పురోగతి లేదని తెలిపారు. విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉంటే మార్చాలని, మల్లవల్లి పారిశ్రామికవాడలో పునాదిరాళ్ల అంశాన్ని పారిశ్రామికవేత్తలకు తెలియజేయాలని ఆదేశించారు.

News February 2, 2026

పదవీ విరమణ ఒక గొప్ప మైలురాయి: SP విద్యాసాగర్

image

సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందించి పదవీ విరమణ చేసిన సిబ్బందికి SP విద్యాసాగర్ నాయుడు వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉంగుటూరు రిటైర్డ్ ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్‌ను SP సన్మానించారు. పదవీ విరమణ అనేది జీవితంలో ఒక గొప్ప మైలురాయి అని, విశ్రాంతి కాలంలో సిబ్బంది ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ SPలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.