Krishna

News January 31, 2026

ప్రభుత్వ పథకాల వారధులు వీఆర్‌ఏలే: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మచిలీపట్నంలో శుక్రవారం ఏపీ వీఆర్‌ఏ అసోసియేషన్ రూపొందించిన నూతన క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు, గన్నవరం సభ్యులు పాల్గొని తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

News January 30, 2026

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉద్యోగ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News January 29, 2026

కడప స్మార్ట్ కిచెన్ భేష్: కలెక్టర్ బాలాజీ

image

కడప సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం కడపలో పర్యటించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే ఈ విధానం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 29, 2026

ఉప్పెన బిడ్డ.. వేల కోట్ల అధిపతి!

image

నాగాయలంక (M)కి చెందిన బొండాడ రాఘవేంద్రరావు జీవితం స్ఫూర్తిదాయకం. దివిసీమ ఉప్పెనలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబంలో పుట్టిన ఆయన కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. L&T, ఆస్టర్‌ టెలికామ్‌లో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2011లో బొండాడ ఇంజినీరింగ్స్‌ను స్థాపించారు. టెలికామ్‌, విద్యుత్ రంగాల్లో విస్తరించి నేడు రూ. 7500 కోట్ల మార్కెట్‌ విలువతో హురూన్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కింది.

News January 28, 2026

కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.

News January 28, 2026

ఉప్పులూరు ఆసుపత్రిలో DMHO ఆకస్మిక తనిఖీ

image

ఉప్పులూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. DMHO యుగంధర్ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా ఆసుపత్రికి వచ్చారు. నేరుగా వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి, అక్కడ చంటిబిడ్డతో కూర్చున్న ఒక తల్లి వద్దకు వెళ్లి.. వైద్య సేవలపై అని ఆరా తీశారు. అనంతరం ఆయన లోపలికి వెళ్లి రిజిస్టర్లు, OP రికార్డులు పరిశీలిస్తుండగా, చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.

News January 28, 2026

కృష్ణా: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

వడ్లమన్నాడు పాఠశాలలో బుధవారం సందడి నెలకొంది. కలెక్టర్ బాలాజీ పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యతను పరీక్షించిన కలెక్టర్, విద్యార్థులతో ముచ్చటించి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంటశాల పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

News January 28, 2026

ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష

image

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న Foundational Literacy & Numeracy కార్యక్రమంపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ తనిఖీలలో భాగంగా 10th విద్యార్థులకు అమలవుతున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ పరిశీలించారు.

News January 28, 2026

కృష్ణా: పల్లకిలోనే వీరమ్మ తల్లి ఊరేగింపు

image

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో అమ్మవారి గ్రామోత్సవంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈసారి కూడా అమ్మవారి ఊరేగింపు సంప్రదాయబద్ధంగా పల్లకిలోనే సాగుతుందని ఆలయ వంశస్థులు స్పష్టం చేశారు. ఈ రాత్రి 9 గంటల తర్వాత ఆలయం నుంచి వెలువడి, రేపు రాత్రికి అమ్మవారు పుట్టింటికి చేరుకుంటారు. రథంపై ఊరేగింపు ఉంటుందనే ప్రచార నేపథ్యంలో, గండదీప భక్తులు పల్లకి సేవనే గమనించాలని కోరారు.

News January 28, 2026

ఉయ్యూరు: వీరమ్మ తల్లి భక్తులకు అల్పాహార ఏర్పాట్లు!

image

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో గండదీపాలు సమర్పించే వేలమంది భక్తుల కోసం దాతలు భారీగా అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నారు. రావిచెట్టు బజార్, మార్కెట్, కాటు రోడ్డు, కోర్టు, బస్టాండ్ సెంటర్లలో ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు ఉచితంగా అల్పాహారం, పాలు, మజ్జిగ పంపిణీ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.