Krishna

News January 27, 2026

చారిత్రక వైభవం.. ఉయ్యూరు వీరమ్మ తల్లి ఉత్సవం!

image

ఐదు శతాబ్దాల చరిత్ర గల ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో ప్రారంభమవుతున్నాయి. పెదకడియంలో జన్మించిన వీరమ్మ, భర్త మరణానంతరం సహగమనం చేసిన మహాసాధ్వి. మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ‘ఉయ్యాల ఊయింపు’ ఘట్టం అత్యంత ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ తిరునాళ్లలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News January 27, 2026

కృష్ణా: విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

image

జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో విద్యా శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రెండవ బహుమతిని చేనేత, జౌళి శాఖ, సాంఘిక, పరిశ్రమల శాఖ సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి దక్కగా, మూడవ బహుమతిని DRDA శకటానికి దక్కింది. ఆయా శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

News January 26, 2026

విశాఖలో కృష్ణా జిల్లా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

అవనిగడ్డ ప్రాంతానికి చెందిన AU MCA ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి విశాఖ నగరంలోని రేసవానిపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహం కుళ్లి, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం పోలీసులు తలుపులు తెరిచి పరిశీలించగా ఘటన వెలుగులోకి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 25, 2026

అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.

News January 25, 2026

కృష్ణా: పద్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి నేపథ్యం ఇదే..!

image

కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వెంపటి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1950 ఆగస్ట్ 12న గుడ్లవల్లేరులో ఆయన జన్మించారు. అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు.

News January 25, 2026

కృష్ణా: డా. నోరి దత్తాత్రేయుడి నేపథ్యమిదే

image

వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డా. నోరి దత్తాత్రేయకు కేంద్రం పద్మ భూషన్ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన డా. నోరి 1947లో జన్మించారు. మచిలీపట్నంలో పాఠశాల విద్య, కర్నూలులో వైద్య విద్యనభ్యసించారు. ప్రపంచంలోనే క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఆయన పేరుగాంచారు. 2015లోనూ డా.నోరి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

News January 25, 2026

కృష్ణా జిల్లాలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు

image

కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పమిడిముక్కలకు చెందిన ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు, గుడ్లవల్లేరుకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి, నిమ్మకూరుకు చెందిన ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరి ముగ్గురు ఆయా రంగాలకు చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

News January 25, 2026

కృష్ణా: రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతున్న పెరేడ్ గ్రౌండ్

image

రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే విధంగా గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయుధ బలగాల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు అనుకూలంగా గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ డీకే బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

News January 25, 2026

కృష్ణా: రిపబ్లిక్ డే రిహార్సల్స్ పరిశీలించిన ఎస్పీ

image

రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిహార్సల్స్‌ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. ఏఆర్ పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. సోమవారం జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో చక్కటి కవాతు ప్రదర్శించాలని ఏఆర్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయక్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News January 24, 2026

కృష్ణా: ద్విచక్ర వాహనదారులకు కలెక్టర్ సూచనలు

image

కలెక్టర్ డీకే బాలజీ శనివారం ఉదయం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వయంగా తనిఖీలు చేపట్టిన ఆయన, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాల కంటే ముందు ప్రాణ రక్షణ పట్ల అవగాహన కల్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ఆయన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు అందజేశారు.