India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, సరైన చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అన్నారు. మచిలీపట్నంలో ఈ నెల 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రజల నుంచి అందే ‘మీ-కోసం’ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో మీ-కోసం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి, పామర్రు MLA వర్ల కుమార్ రాజా సహకారంతో APSSDC ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న కురుమద్దాలిలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి PG వరకు చదివి, 18-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు రెజ్యూమ్, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు కురుమద్దాలి కమ్యూనిటీ హాల్‌కు హాజరుకావాన్నారు. పూర్తి వివరాల కోసం naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని వివరించారు.

బాపులపాడు మండలం తిప్పనగుంటలో వాగు వంతెన సమీపంలోని <<19023974>>విద్యుత్ స్తంభాలు <<>>నేలకి ఒరిగి ప్రమాదకరంగా మారడంతో రైతులు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ‘తిప్పనగుంటలో ప్రమాదకరంగా స్తంభాలు’ శీర్షికన ఆదివారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన వీరవల్లి సబ్‌స్టేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఓరిగిపోయిన విద్యుత్ స్తంభానికి సోమవారం మరమ్మతులు చేపట్టారు.

PGRSలో వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన PGRSలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత శాఖల వారీగా పెండింగ్ అర్జీల పరిష్కార చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ అర్జీలన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్‌గా పనిచేశారు.

పది, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా సహకరించాలని DSP రాజా విజ్ఞప్తి చేశారు. ప్రార్థనా స్థలాలైన దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పరిమితికి మించి లౌడ్ స్పీకర్లు వాడకూడదని సూచించారు. శబ్ద కాలుష్యం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల సమయంలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ శబ్ద నియంత్రణ పాటించాలని కోరారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ డీ.కే బాలాజీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే చోటు దక్కించుకున్నాయని ఆయన తెలిపారు. వాటిలో ఒకటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టు కావడం విశేషమని అన్నారు.
Sorry, no posts matched your criteria.