India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో కీలక నగరాల మధ్య బస్సు ప్రయాణం సులభతరం వేగవంతం చేసేదిగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ మీదగా బస్సులు నడిపించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి 2ఈ గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదగా నడిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తద్వారా ప్రయాణికులకు 1.15 గంటల సమయం కలిసి రానుంది.
చల్లపల్లి మండలం నూకలవారిపాలెం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇనుప చువ్వలలోడ్ లారీ ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కాగా ఆదివారం ఇదే అవనిగడ్డ నియోజకవర్గంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురికి గాయాలైన విషయం తెలిసిందే.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టమాటా ధర ఠారెత్తిస్తోంది. గతవారం కేజీ రూ.40 పలికిన టమాటా ఆదివారం రూ.80కి పెరిగింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉల్లిపాయలు కేజి రూ.50, బీరకాయలు రూ.60, వంకాయలు రూ.80, దొండ కాయలు రూ.40కి అమ్ముతున్నారు. బెండకాయలు కేజి ధర రూ.50, బంగాళాదుంప రూ.40, క్యారెట్ రూ.50, పచ్చిమిర్చి రూ.50, అల్లం రూ.140, కాకరకాయ కేజీ ధర రూ.50గా ఉన్నాయి.
మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు.
కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారని జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదివారం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారని తెలిపింది.
⁍ విజయవాడలో విషాదం.. పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి
⁍ కృష్ణా: TDP MLC అభ్యర్థి ఖరారు?
⁍ చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి
⁍ తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని
⁍ రేపు విజయవాడకు రానున్న సినీ హీరో
⁍ కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. రేపు ప్రజావేదికలో మంత్రి అనిత వంగలపూడి, టీడీపీ సీనియర్ నేత BT నాయుడు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని పల్లా శ్రీనివాస్ తన అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించి పేకాట స్థావరాలపై దాడులు చేశామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతూ.. పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకుని పట్టుబడ్డవారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపింది.
అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ-పెనుమూడి వారిధిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. రేపల్లె నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ను ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడ నగరానికి సినీ హీరో కార్తీ సోమవారం రానున్నారు. ఇటీవల సత్యం సుందరం సినిమా విడుదలై విజయవంతం కావడంతో సినీ హీరో విజయవాడకు రానున్నట్లు సమాచారం. ఉదయం 10గంటలకు దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటలకు క్యాపిటల్ సినిమా ఆవరణంలో నగర ప్రజలతో కలిసి సందడి చేస్తారని సినీ యూనిట్ సభ్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.