India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు కలెక్టర్ జి.సృజన ఆదివారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉంటుందని సూచించారు.
రాష్ట్రానికి 30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ పశ్చిమ MLA సుజనా ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. అమరావతిలో రూ.250కోట్లతో 400 పడకల ESI ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసిందని సుజనా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైల్స్ వెతికారని, అసైన్డ్ పట్టాలు చూశారన్నారు. తాను తప్పు చేసింటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు.
కానూరు తులసినగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18- 35 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు అక్టోబర్ 3లోపు ఈ శిక్షణకు ఫెడరల్ స్కిల్ అకాడమీలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. Shareit
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.
ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల (సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ఏటీఎంలు, వ్యాపార సముదాయాల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.