India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బుకింగ్ చేసుకున్న వెంటనే సరైన రవాణాతో ఇసుక సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.సృజన ఆదేశించారు. ఇసుక రవాణా వాహనదారులతో పటిష్ఠ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు.
దసరా ఉత్సవాలకు విజయవాడకు వచ్చేవారి కోసం 964 ప్రత్యేక బస్సులు నడుపుతామని APSRTC తెలిపింది. ఈ బస్సులను అక్టోబర్ 3- 15 వరకు 13 రోజులపాటు నడుపుతామంది. అదే సమయాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నందున HYD నుంచి విజయవాడకు బస్సులలో 353 సర్వీసులు నడుపుతామని తెలిపింది. రాజమండ్రి రూట్లో 241, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేందుకు మిగతా బస్సులు నడుపుతామని RTC తెలిపింది.
2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గుడివాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎల్.గౌరీమణి తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని సమాచారం. గురువారం తెల్లవారుజామున రాధాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషనలో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా హర్షసాయి విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏ.కొండూరు అడ్డరోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మామిళ్ల శ్రీనివాసరావు(45), కుమారుడు ప్రసంగి(16) షాపు క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలోని పలు విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్‌ను నియమించారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.