India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అసభ్య కార్యకలాపాలపై సమాచారం మేరకు ఎస్‌ఐ చంటిబాబు దాడులు నిర్వహించారు. శనివారం మల్లాయపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార కేంద్రంగా మార్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్‌లు, బైక్, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 87% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 83.5% ఉత్తీర్ణతతో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండవ స్థానంలో, 79% ఉత్తీర్ణతతో మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు జిల్లా అధికారి సాల్మన్ రాజు అభినందించారు.

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ.బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీల స్వయం ఉపాధికై బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10వ తేదీలోపు https:///apobmms.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మార్చి నెలలో జరిగిన కృష్ణా యూనివర్శిటీ B.Ed 1వ సెమిస్టర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కంప్యూటరీకరణ ద్వారా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కంప్యూటరైజ్డ్ మూల్యాంకనాన్ని శనివారం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ప్రారంభించారు. ఈ పద్ధతి వల్ల ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని, ఫలితాలు త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఉపకులపతి చెప్పారు.

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మళ్లీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84% ఫలితాలు రాగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణులయ్యారు. నేడు విడుదలైన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 85%, ద్వితీయ సంవత్సరంలో 93% మంది ఉత్తీర్ణులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. డీజీపీతో కలిసి ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ విద్యశ్రీ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్‌ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.