India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో నేడు వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. పోలీసులు వంశీని 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టుకు వివరించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
మల్లవల్లి పారిశ్రామిక వాడలో 405 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా రానున్నాయి. ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు త్వరలో రానున్నాయి. ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు వేగంగా ఓ పట్టణంగా మారబోతుంది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ ఈనెల 19న ప్రారంభం కానుంది. ప్రభుత్వం పనులను వేగవంతం చేయడంతో అశోక్ లేలాండ్ బస్సు బిల్డింగ్ యూనిట్ సిద్ధమైంది. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ యూనిట్‌ను మార్చి 19న మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. మొత్తం ఈ పారిశ్రామిక వాడ 1,467 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సోమవారం వరకు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండలాల పరిధిలో ఈ కార్యక్రమం రద్దు చేశారు. కోడ్ ముగియడంతో ఈ సోమవారం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయిలో యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొర్రపోతుపాలెంకు చెందిన శివనాగరాజు భార్య కొంతకాలం క్రితం మృతి చెందింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు నాగరాజుపై కేసు పెట్టారు. ఈ మేరకు జైలు నుంచి కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చాడు. శనివారం రైల్వే ట్రాక్‌వైపు వెళ్లగా రైలు ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ శక్తి టీమ్ విద్యార్థులు, మహిళల భరత్ భద్రతపై శ్రమిస్తున్నందుకుగాను.. వారి సేవలను గుర్తించి కలెక్టర్ డీకే బాలాజీ శనివారం అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ సిబ్బందికి పోలీస్ అధికారులు, పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో మహిళా సంక్షేమానికి రూ.4,392 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిపామన్నారు. శనివారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గాను జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ (RWS) కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు RWS SE శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే 08672-223522 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు.
మెగా DSC రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు మచిలీపట్నంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని మిత్రులు, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్‌లకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని 1టౌన్ సీఐ శ్రీనివాస్, 2టౌన్ సీఐ దుర్గాప్రసాద్‌లు తెలిపారు. 2024లో వాలంటీర్లు, ఆటోనగర్‌లోని లిక్కర్ గోడౌన్ విషయంలో నమోదైన కేసులలో కొడాలి, దుక్కిపాటి, పాలడుగు, గొర్ల శీను తదితరులపై నమోదైన కేసులో పలువురికి 41ఏ నోటీసులు అందజేశారన్న వార్తలను సీఐలు ఖండించారు.
Sorry, no posts matched your criteria.