India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు.

మానవ తావాదం, ఆదర్శవాదం వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మైలవరంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. దేవుని చెరువులో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు భార్య, పిల్లల్ని వదిలేసి ఓ మహిళతో సహజీనవం చేస్తున్నాడు. ఆ మహిళ సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చే సరికి వెంకటేశ్వరరావు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులుకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు అయింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై వాదనాలు పూర్తి అయ్యాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై సోమవారం కోర్టు తీర్పు వెలువరించనుంది.

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయ సంస్థలకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌లను పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రవి కుమార్ పాల్గొన్నారు.

విధి నిర్వహణలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు భార్య వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. ఆమెను జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఎస్పీ ఆర్. గంగాధరరావు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.

కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS)గా నియమితులైన శేషు కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా DCHSగా పనిచేస్తున్న శేషు కుమార్ ఇటీవల జిల్లాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.