Kurnool

News September 3, 2024

ఆళ్లగడ్డలో 85 గొర్రెలు సజీవ దహనం

image

ఆళ్లగడ్డలోని బృందావన్ కాలనీ వెంచర్ సమీపంలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోవడంతో అందులోని 85 గొర్రెలు సజీవ దహనం అయ్యాయి. రాత్రి 10:30 గంటల సమయంలో గొర్రెలకు దోమలు కుట్టకుండా గొర్రెల యజమాని మిట్టపల్లి కృష్ణయ్య పొగ పెట్టడంతో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకుంది. అందులో ఉన్న 85 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.

News September 3, 2024

వాగులు, వంకల వద్ద నిఘా ఉంచండి: కలెక్టర్

image

వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతర నిఘా ఉండాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ రాజకుమారి సోమవారం ఆదేశించారు. దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టం, తదితర వాటిపై సంబంధిత అధికారులు వెంటనే నివేదికలు అందించాలని సూచించారు.

News September 3, 2024

వాగులు, వంకల వద్ద నిఘా ఉంచండి: కలెక్టర్

image

రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతర నిఘా ఉండాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ రాజకుమారి సోమవారం ఆదేశించారు. దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టం, తదితర వాటిపై సంబంధిత అధికారులు వెంటనే నివేదికలు అందించాలని సూచించారు.

News September 2, 2024

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

3న జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జాబ్ మేళా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కర్నూలు వారు https://forms.gle/1STUAB5Aq7LBr9gGAలో, ఆలూరు వారు https://forms.gle/SwB7N2tJFsfa7FZEA లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News September 2, 2024

ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి: కలెక్టర్

image

నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాలు, ఉపాధి హామీ పథకం అమలు, పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్వహణ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మండల వారీగా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలతో పురోగతిపై సమీక్ష చేశారు.

News September 2, 2024

కర్నూలు జిల్లాకు పతకాల పంట

image

ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు జిల్లాకు అత్యధిక పతకాలు లభించాయి. వివిధ విభాగాల్లో మొత్తం 12 పతకాలు సాధించినట్లు కోచ్ యూసఫ్ తెలిపారు. వీరేశ్ సిల్వర్ (55 KG), బీ.వీరేశ్ గోల్డ్, బ్రాంజ్ (61 KG), అబ్దుల్ బ్రాంజ్ (81 KG), నరసింహ బ్రాంజ్ (89 KG), ముష్రీఫ్ సిల్వర్, బ్రాంజ్ (109 KG), వెంకట నాయక్ బ్రాంజ్ (109 KG) సాధించారు.

News September 2, 2024

నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా

image

మహానంది మండలం అబ్బీపురం గిరిజన కాలనీలో రోడ్డు నిర్మాణం, వీధిలైట్లు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, గిరిజనులు బైఠాయించి తమ నిరసన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

News September 2, 2024

నాడు కర్నూలు.. నేడు విజయవాడ!

image

2009 అక్టోబర్ 2న కర్నూలును వరదలు ముంచెత్తాయి. తుంగభద్ర జలాశయం వరద నీరు కర్నూలు నగరాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే విజయవాడను చుట్టుముట్టాయి. విజయవాడలో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉండగా, నాటి కర్నూలు రోజులను పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

News September 2, 2024

నంద్యాల జిల్లాలో శతాధిక వృద్ధురాలి మృతి

image

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం చెన్నూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సింగిరెడ్డి లక్ష్మమ్మ (110) ఆదివారం మృతి చెందారు. ఈ వయసులోనూ చాలా చురుగ్గా ఉండేవారని, తన పనులు తానే స్వయంగా చేసుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరి మీద ఆధార పడకుండా ఇన్నేళ్లు జీవించిన లక్ష్మమ్మ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మిత ఆహారమే ఇన్ని రోజులు బతకడానికి కారణమని స్థానికులు తెలిపారు.

News September 2, 2024

అవుకు మండలంలో దారుణం

image

అవుకు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన దస్మయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దస్మయ్యను తాళ్లతో కట్టేసి దేహ శుద్ధి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.