Kurnool

News August 30, 2024

మొక్కలు నాటిన మంత్రి బీసీ

image

మొక్కల సంరక్షణతోనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి అందడమే కాకుండా సకాలంలో వర్షం కురుస్తాయని రోడ్డు, భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి R&B గెస్ట్ హౌస్‌ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి R&B డీఈ, తదితర ఉన్నతాధికారులు, మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News August 30, 2024

రేషన్ కార్డుదారులకు తీపి కబురు

image

రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు పంచదార పంపిణీకి చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ 2 నెలలుగా పంచదార పంపిణీ ఆపేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో 6,76,209 మంది రేషన్ కార్డుదారులకు 10,715 టన్నుల బియ్యం, 352 టన్నుల పంచదార, నంద్యాల జిల్లాలో 5,41,804 మంది కార్డుదారులకు 7,361 టన్నుల బియ్యం, 276 టన్నుల పంచదార పంపిణీ చేయనుంది.

News August 30, 2024

నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: నంద్యాల ఎస్పీ

image

నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అధికారులకు ఆదేశించారు. గురువారం ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నైట్ బీట్, పెట్రోలింగ్ పెంచి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 29, 2024

మద్యం మత్తులో యువకుడి గొంతు కోశాడు.. నంద్యాలలో ఘటన

image

నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో గురువారం దారుణం జరిగింది. మద్యం మత్తులో బషీర్ అనే వ్యక్తిపై బుజ్జి అనే యువకుడు గొంతు కోసి హత్యాయత్నం చేశారు. వీరి గొడవలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 29, 2024

కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీ వెంకటరామయ్య గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. సెప్టెంబరు 1న సెలవు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే 31న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News August 29, 2024

ఇసుక బుకింగ్‌కు విశేష స్పందన

image

కర్నూలు జిల్లాలో ఇసుక బుకింగ్‌కు విశేష స్పందన లభించింది. తొలి రోజు 195 బుకింగ్‌లకు గాను 3,312 టన్నులు ఇసుకను వాహనాలకు లోడు చేశారు. సీ.బెళగల్ మండలంలోని రీచ్ నుంచి 80 బుకింగ్‌లకు 1,034 టన్నులు, కర్నూలు మండల రీచ్ నుంచి 115 బుకింగ్స్‌కు 2,278 టన్నులు లోడింగ్ చేశామని మైనింగ్ జిల్లా డీడీ రాజశేఖర్ అన్నారు. ఇందులో 150 టిప్పర్లు, 45 ట్రాక్టర్లు లోడ్ అయ్యాయన్నారు.

News August 29, 2024

పిచ్చికుక్కను తరుముతూ గుండెపోటుతో రైతు మృతి

image

పిచ్చికుక్కను తరమడానికి వెళ్లి ఓ రైతు మృతిచెందిన ఘటన దేవనకొండ మండలం నేలతలమర్రిలో జరిగింది. బోయ చంద్ర(40) గొర్రెలు పెంచుతున్నాడు. మంగళవారం రాత్రి ఓ పిచ్చికుక్క గొర్రెలను కరవబోతే చంద్ర దానిని తరమడానికి వెళ్లాడు. అది తిరగబడి కరవడానికి రావడంతో పరిగెత్తుతూ గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. స్థానికులు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News August 29, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెన్షనర్లకు GOOD NEWS

image

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NTR భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ఆదివారం ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఓ రోజు ముందుగానే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాలో 2,46,871 మందికి, నంద్యాల జిల్లాలో 2,22,398 మంది లబ్ధిదారులకు 1వ తేదీన అందాల్సిన పెన్షన్ ఓ రోజు ముందుగానే అందనుంది.

News August 29, 2024

ప్రేమించి మోసపోయానని యువకుడి ఆత్మహత్య

image

కర్నూలులో బుధవారం అశోక్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లా కొంకలకు చెందిన అశోక్‌ బేల్దారి పనులు చేస్తుండేవాడు. ఓ కానిస్టేబుల్‌ కుమార్తెను ప్రేమిస్తుండేవాడు. ఆ అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం జరిగిందని మనస్తాపానికి గురయ్యాడు. తన ఫ్రెండ్ నవీన్‌తో కలిసి మంగళవారం కర్నూలులో లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. నవీన్‌ బయటకు వెళ్లిన సమయంలో అశోక్‌ ఫ్యానుకు ఉరేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 29, 2024

బాలికపై అత్యాచారయత్నం

image

హోళగుంద మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు ఎస్సై బాల నరసింహులు తెలిపారు. బాలిక అంగడికి వెళ్తుండగా ఆదే గ్రామానికి చెందిన నాగేశ్ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.