Kurnool

News March 18, 2026

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్‌ను టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.

News March 18, 2026

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

image

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలు బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సు ప్రయాణం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సంక్షేమానికి సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులోనూ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

News March 18, 2026

ఆదోని: యువతి ఆత్మహత్య

image

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2026

ఆదోని: యువతి ఆత్మహత్య

image

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2026

కర్నూలు: 189 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 16,130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 15,941 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 18, 2026

కర్నూలు కలెక్టర్ కీలక సూచనలు

image

కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. తాగునీరు, చలివేంద్రాలు, నీడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండలో పని చేయవద్దన్నారు. కార్మికులకు విశ్రాంతి కల్పించాలని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బల చికిత్సకు వైద్యశాఖ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

News March 17, 2026

పోరాటాలతోనే యూనివర్సిటీ అభివృద్ధి: ఎస్ఎఫ్ఐ

image

రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి పోరాటాలే మార్గమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి మాట్లాడారు. ఖాళీ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అభివృద్ధికి ₹200 కోట్లు కేటాయించి కొత్త భవనాలు, కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు.

News March 17, 2026

కర్నూలు జిల్లాలో 358 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 16, 2026

కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News March 16, 2026

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

image

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.