Kurnool

News March 15, 2026

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2026

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.

News March 14, 2026

కర్నూలులో ఈనెల 16న గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 16న (సోమవారం) కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంనిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. అదేరోజు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

కర్నూలులో కట్టుదిట్టమైన బందోబస్తు: ఎస్పీ

image

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులను కేంద్రాల వద్దకు అనుమతించరని పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 14, 2026

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్‌మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

News March 14, 2026

కర్నూలులో 397 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 397 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,522 మందికి గాను 5,125 మంది మాత్రమే హాజరైనట్లు RIO లాలప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు.

News March 14, 2026

10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

News March 14, 2026

కర్నూలు జిల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

జోహారాపురం సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలోని 2,72,757 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.154.94 కోట్లు జమ చేసిందని కలెక్టర్ తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమవుతుందని తెలిపారు.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2026

కర్నూలులో గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: జేసీ

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్లాంట్లలో 3-6 రోజుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కమర్షియల్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన పెంచాలన్నారు. మార్కెట్లలో ఆహార నాణ్యత, తూనికలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు.