India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వినతులు అందించిన వారికి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పీజీఎస్ఆర్‌లో మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగ మోసం, భూ వివాదాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమస్యలు, ఫైనాన్స్ తదితర అంశాలపై ప్రజలు వినతులు అందించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.