Kurnool

News August 18, 2024

లోకేశ్ చొరవ.. కర్నూలులో సమస్యకు పరిష్కారం

image

మంత్రి నారా <<13881711>>లోకేశ్<<>> చొరవతో కర్నూలులో మురుగు సమస్యకు పరిష్కారం లభించింది. ‘కర్నూలు నగర శివారుకు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది ఈ సమస్య. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా మురుగు నీరు బయటికి వెళ్లేందుకు వీలులేదు. ప్రస్తుతం 1.70 కి.మీ మేర కచ్చ కాలువ నిర్మించి గల్ఫర్‌తో మురికి నీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం’ అని KMC ట్వీట్ చేసింది.

News August 18, 2024

నంద్యాల: రోకలి బండతో కొట్టి అన్నను చంపిన తమ్ముడు

image

వెలుగోడు మండలం మోత్కూరులో పసుపుల మల్లికార్జున హత్యకు గురయ్యారు. వరుసకు తమ్ముడైన పసుపుల శ్రీనివాసులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో మల్లికార్జున(40) తలపై రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి బాల నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News August 18, 2024

KNL: త్వరలో భారీగా పోలీసుల బదిలీ?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో త్వరలో భారీగా ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. తాజాగా కర్నూలు రేంజ్ పరిధిలో పెద్ద సంఖ్యలో CIలను బదిలీ చేస్తూ DIG ఉత్తర్వులు జారీ చేయగా, SIలను బదిలీ చేస్తూ కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలు ఉత్తర్వులిచ్చారు. దీంతో త్వరలో ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

News August 18, 2024

ప్రమాదకరంగా కుందర వాగు వంతెన

image

కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు సమీపాన కోవెలకుంట్ల-ఆళ్లగడ్డ R&B రహదారిలో కుందర వాగుపై ఏర్పాటుచేసిన వంతెన ప్రమాదకరంగా ఉంది. 1932 బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. 92 ఏళ్లు కావడంతో వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన కడ్డీలు వంగిపోవడంతో పాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉంది.

News August 18, 2024

KNL: పరిష్కారం కాని సమస్య.. మంత్రి లోకేశ్ క్షమాపణ!

image

ఇంటి పరిసర ప్రాంతంలో మురికి నీరు ప్రవేశించడంపై PGRSలో కర్నూలు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. కాగా అధికారులు కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసి, సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చూపారు. దీంతో బాధితుడు మంత్రి నారా లోకేశ్‌కు ఈ విషయాన్ని Xలో వివరించారు. స్పందించిన లోకేశ్ అతనికి క్షమాపణలు తెలిపారు. ‘నా బృందం సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తుంది’ అని హామీ ఇచ్చారు.

News August 18, 2024

20వ తేదీ నుంచి ఆధార్ క్యాంపులు: కలెక్టర్

image

కర్నూలు: ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ఆధార్ క్యాంపులను సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు కొత్తగా నమోదుతో పాటు అప్డేట్, బయోమెట్రిక్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News August 17, 2024

ఫ్రీ ఓల్డ్ భూములపై సమగ్ర నివేదిక: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని ఫ్రీ ఓల్డ్ భూములకు సంబంధించి సమగ్ర నివేదికను పంపాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ సదస్సులు, హౌసింగ్, ఉపాధి హామీలపై తహశీసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజులు, ఏడాది, 5 ఏళ్లు లక్ష్యాలను ఏర్పరుచుకుని జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ సదస్సులకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

News August 17, 2024

ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోనిలోని రాజ్ నగర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్‌(22) అనే ఫొటో గ్రాఫర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బైచిగేరికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. మృతుడు ఆదోనిలోని సంజన స్టూడియోలో పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 17, 2024

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్యాధికారి

image

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. శనివారం బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రికార్డ్స్ వెరిఫై చేసి వాక్సినేషన్ పెర్ఫార్మన్స్, BCG, ANC, రికార్డులను ఇంప్రూవ్ చేసుకోవాలని డాక్టర్ కిరణ్ కుమార్‌కు సూచించారు.

News August 17, 2024

KNL: ఫెయిల్ అయిన విద్యార్థులకు SVU శుభవార్త

image

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులు ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినవారికి యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. ఆ విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు SV యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉత్తర్వులు జారీ చేశారు. Website: www.svuniversity.edu.in