Kurnool

News August 17, 2024

మంత్రాలయం: నదిలో దూకిన మహిళ

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామానికి చెందిన తిక్క లక్ష్మి అనే మహిళ దూకింది. గమనించిన కానిస్టేబుల్ రంగస్వామి ఆమెను కాపాడి మెరుగైన వైద్యం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆమెను కాపాడటంతో నది దగ్గర ఉన్న భక్తులు అభినందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 17, 2024

నంద్యాల: నేషనల్ పైవేపై ప్రమాదం..డ్రైవర్ మృతి

image

నంద్యాల జిల్లా డోన్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మ్యాక్స్ ఫోర్ హోటల్ ఎదురుగా శనివారం తెల్లవారుజామున లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 17, 2024

కర్నూలు: నేడు 24 గంటలు వైద్య సేవలు బంద్

image

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా నగరం ఆర్జే కార్ హాస్పిటల్లో హత్యాచార ఘటనకు నిరసనగా జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ 24 గంటల పాటు (శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు) సాధారణ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్ రెడ్డి తెలిపారు. కేవలం అత్యావసర కేసులు మాత్రమే చూస్తామన్నారు.

News August 17, 2024

పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రణాళిక రూపకల్పనలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలు ఆదాయం వచ్చేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నివేదికలు అందజేయాలన్నారు.

News August 16, 2024

కర్నూలు: గుండెపోటుతో రైతు మృతి

image

అప్పులు తీర్చలేక చిప్పగిరి మండలం నగరడోనకు చెందిన రైతు గొల్ల చిన్న రంగస్వామి(48) తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై శుక్రవారం మరణించారు. మృతుడు సాగు కోసం దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురవుతూ శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో గుంతకల్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మరణించారు. ఈయనకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.

News August 16, 2024

లక్ష్యాలతో జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి: కలెక్టర్

image

ఐదేళ్ల లక్ష్యాలతో జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని, లక్ష్యాల సాధనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐదేళ్ల విజన్ ప్లాన్ రూపకల్పనపై జిల్లా అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగనుంది.

News August 16, 2024

బహిరంగ వేలం వేసి దుకాణాలు ప్రారంభించాలి: సీపీఎం

image

ఆలూరు సంత మార్కెట్‌లో రూ 1.20 లక్షలతో నిర్మించిన 29 షాపులను, రూ.80 లక్షలతో నిర్మించిన 16 షాపులను ప్రారంభించి బహిరంగ వేలం వేయాలని సీపీఎం మండల కార్యదర్శి షాకీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలూరు సంత మార్కెట్‌ వద్ద నిరసన తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించలేదన్నారు. వాటిని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.

News August 16, 2024

కర్నూలు: బతకాలంటే రూ.18 కోట్లు కావాల్సిందే

image

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని పెద్ద మర్రివీడుకు చెందిన నాగేశ్, మరియమ్మల రెండో కుమార్తె అక్షయ(2) స్పైనల్ మస్కులర్ ఆట్రోపీతో బాధపడుతోంది. ప్రాణాంతక సమస్య కావడంతో జోల్ జేరి ఏస్ఎంఏ ఇంజక్షన్ చేయాలని HYDలో వైద్యులు స్పష్టం చేశారు. దాని విలువ రూ.18 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

News August 16, 2024

నంద్యాల పూర్వ కలెక్టర్‌కు ఫైన్..ఎందుకంటే..?

image

నంద్యాల పూర్వ కలెక్టర్‌కు హైకోర్టు రూ.10 వేల ఫైన్ వేసింది. లైమ్‌స్టోన్ భూములను కాటసాని రామిరెడ్డి అనుచరులకు అసైన్డ్ చేసేందుకు సిఫార్సు చేశారని మంత్రి బీసీ ఆరోపించారు.ఈ ప్రక్రియను నిలిపివేయాలని 2023లో హైకోర్టులో ఫిల్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి, కలెక్టర్‌కు కోర్టు ఆదేశించినా వేయలేదు. బుధవారం వెలువరించిన తీర్పులో గనుల శాఖ కార్యదర్శికి కూడా రూ.20వేలు ఖర్చులు విధించింది.

News August 16, 2024

కర్నూలు జిల్లాలో KGBV ప్రిన్సిపల్ తొలగింపు

image

కర్నూలు జిల్లా పరిధిలోని ఎమ్మిగనూరు KGBV ప్రిన్సిపల్ కవితపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఇటీవల పలు వార్తా పత్రికలు, మీడియాలో వచ్చిన “విద్యార్థులకు అందని భోజనం” అనే కథనాలపై ప్రభుత్వం ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు, వాస్తవమని తేలడంతో ఆమెను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కర్నూలు డిఈవో ఉత్తర్వులు జారీ చేశారు.